Begin typing your search above and press return to search.
దటీజ్ కేటీఆర్.. 4 రోజుల కిందట అలా.. ఇప్పుడిలా.. ఎక్కడి లెక్క అక్కడే
By: Tupaki Desk | 29 April 2022 2:30 PM GMTరాజకీయాల్లో స్నేహం స్నేహమే.. లెక్క లెక్కే.. ఈ విషయం బాగా తెలిసినవారే రాణించగలుగుతారు. తమ రాష్ట్ర ప్రగతి దగ్గరకు వచ్చేసరికి ఏ నాయకుడైనా నిక్కచ్చిగా ఉండాల్సిదే. ప్రత్యర్థుల విమర్శలకు ఆస్కారం ఉండకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి. అంతేకాదు తమ కార్యకర్తలు, నేతలు ఆత్మ విశ్వాసంతో ఉండేందుకూ ఇది చేయాల్సిన పనే.
దీనినే నిరూపించారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. సరిగ్గా నాలుగైదు రోజుల కిందట.. అంటే టీఆర్ఎస్ ప్లీనరీకి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో్ ఏపీ సీఎం జగన్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని కచ్చితంగా తేల్చిచెప్పారు కేటీఆర్. అంతేకాదు.. చంద్రబాబు హయాం మాదిరిగానే ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదంతా నాణేనికి ఒకవైపు. తాజాగా చూస్తే ఏపీలో కరెంటు లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు లేవు.. అని వ్యాఖ్యానించారు. అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు అనే కోణంలో మాట్లాడారు. అవసరమైతే పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండని కూడా పేర్కొన్నారు. దీన్నిబట్టి ఏపీలోని పరిస్థితిపై తన మాటల పట్ల ఆయన ఎంతటి కచ్చితత్వంతో ఉన్నారో తెలిసిపోతోంది.
భూముల ధరలు పడిపోయిన ఏపీ గురించి..
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదో రాజకీయ సభలోనివో, ప్రయివేటు కార్యక్రమంలోనివో కాదు.. ఏకంగా క్రెడాయ్ ప్రాపర్టీ షోలో చేసిన వ్యాఖ్యలు. ‘‘క్రెడాయ్’’((ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)) వంటి ఉన్నత స్థాయి సంస్థ సమావేశంలో చేసిన వ్యాఖ్యలవి. క్రెడాయ్ రియల్ ఎస్టేట్ సంబంధ సంస్థ అయిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను ప్రాధన్యతా కోణంలో చూడాల్సిందే. అసలే ఏపీలో భూముల ధరలు పడిపోయాయి.
రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. రాజధాని అమరావతి సంగతి చెప్పక్కర్లేదు. కానీ, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ.10 లక్షలకు తక్కువ లేదు. ఇక హైదరాబాద్ వంటి చోట్లయితే గజమే లక్షల్లో పలుకుతోంది. అలాంటి సమయంలో క్రెడాయ్ వంటి సంస్థ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తక్కువ అంచనా వేయలేం.
పెట్టబడుల కోణంలో చూసినా..
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం కోసం కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులకైతే ఇటీవల అమెరికా కూడా వెళ్లొచ్చారు. చాలాకాలంగా తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాలకూ పరిశ్రమలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నారు. ఇప్పటికే ఐటీ సెక్టార్ ను ఖమ్మం, కరీంనగర్ వంటి నగరాలకూ దగ్గర చేస్తున్నారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ ధరలు కూడా టీఆర్ఎస్ సర్కారుకు కలిసి వస్తున్నాయి.
ఓ విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలంగాణ ఇప్పుడు బంగారు బాతు. ఈ నేపథ్యంలోనే క్రెడాయ్ ప్రాపర్టీ షో లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రాధాన్యంగా చూడాలి. సీఎం కేసీఆర్ తన దక్షత, సమర్థతతో రాష్ట్రంలో 6నెలల్లో విద్యుత్ కొరతను తీర్చారన్నారు. గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతూనే.. ఏపీ వైఫల్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మొత్తానికి స్నేహం కథ స్నేహానిదే..రాష్ట్రం ప్రగతి రాష్ట్రానిదే అన్నట్లు కేటీఆర్ మాట్లాడారు.