Begin typing your search above and press return to search.
యూత్ కు గేట్స్ ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటో తెలుసా?
By: Tupaki Desk | 23 March 2021 5:30 AM GMTప్రపంచ కుబేరుల్లో ఒకరు.. టెక్ దిగ్గజంగా.. మానవాళి భవిష్యత్తును సరిగ్గా అంచనా వేసే అతి కొద్దిమంది మేధావుల్లో ఒకరు బిల్ గేట్స్. ఆయన మాటలు.. విజన్ అన్ని మిగిలినవారికి కాస్త భిన్నంగా ఉంటాయి. లక్షలాది కోట్ల సంపద ఉన్నప్పటికీ సింఫుల్ గా ఉండటం ఆయనలో కనిపించే గొప్ప లక్షణం. అంతేకాదు.. సంపాదించిన ధనాన్ని అంతే సింఫుల్ గా దానాలు ఇవ్వటం ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
అలాంటి గేట్స్ తాజాగా యూత్ కు తానిచ్చే సలహా అదొక్కటేనని చెప్పుకొచ్చారు. ఇంతకీ యూత్ కు ఆయన ఇచ్చిన సలహా ఏమిటో తెలుసా? సింథటిక్ మీట్. ధనిక దేశాలన్నీ వంద శాతం సింథటిక్ మీట్ లోకి వెళ్లిపోవాలని.. యూత్ కూడా దాన్ని తినేందుకు అలవాటు పడాలన్నారు. తాను తింటానని.. అందరిని తినమన్న గేట్స్.. రుచిలో వ్యత్యాసం ఉంటుంది కానీ.. అలవాటు పడితే అదే రుచిగా ఉంటుందన్నారు.
ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్ లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ఆయన.. పర్యావరణ మార్పులపై కూడా వెంటనే ఫోకస్ చేయాలన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తాను చేస్తున్న పనుల గురించి వెల్లడించారు. కర్భన ఉద్గారాల్ని తగ్గించుకోవటానికి మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తే.. సింథటిక్ మాంసాన్ని తింటున్నానని.. గ్రీన్ ఏవియేషన్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి వద్ద సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేశానని.. ఎలక్ట్రిక్ కారును వాడుతున్నట్లు చెప్పారు.
కరోనా గురించి 2015లోనే హెచ్చరించిన గేట్స్ వీడియో ఆ మధ్య తెగ వైరల్ కావటం తెలిసిందే. సమీప భవిష్యత్తులో పెద్ద సంక్షోబాన్ని ఎదుర్కొంటారని తాను చెప్పిన జోస్యం నిజమైన వేళ ఎలాంటి మంచి అనుభూతి కలుగలేదన్నారు. త్వరలో రెండు విపత్తులు తప్పవన్న ఆయన.. అందులోఒకటి వాతావరణంలో వస్తున్న మార్పు అయితే.. మరొక దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే.. బయో టెర్రరిజంగా అభిప్రాయపడుతున్నారు.