Begin typing your search above and press return to search.
భారత్ ఓటమికి కారణం అదే.. నేను ముందే చెప్పాః సచిన్
By: Tupaki Desk | 24 Jun 2021 3:32 PM GMTవరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి అభిమానులతోపాటు సీనియర్లను సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్ షిప్ ను టీమిండియా కోల్పోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వైఫల్యంపై సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.
ఏం జరిగే అవకాశం ఉందో? దాన్ని ఎలా అడ్డుకోవాలో ముందే చెప్పానని, అయినప్పటికీ.. జాగ్రత్త పడలేకపోయారని అన్నాడు. బాధ్యతగా ఆడకపోవడం వల్లనే అద్భుతమైన విజయాన్ని అందుకోలేకపోయారని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు మాస్టర్.
''డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజీలాండ్ కు అభినందనలు. మీది అద్భుతమైన జట్టు. టీమిండియా నాసిరకమైన ఆటతీరుతో నిరాశ పరిచింది. చివరిరోజున మొదటి పది ఓవర్లే చాలా కీలకమని నేను ముందుగానే చెప్పాను. కానీ.. కేవలం పది బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ, పుజారా వికెట్లు కోల్పోవడంతో జట్టు తీవ్ర ఒత్తిడికి గురైంది'' అని ట్వీట్ చేశాడు.
ఆఖరి రోజుకు ఆటను అంచనా వేస్తూ సచిన్ ముందుగానే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తొలి పది ఓవర్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయని చెప్పాడు. తొలి సెషన్ ద్వారానే మ్యాచ్ భవిష్యత్ నిర్ణయిస్తుందని చెప్పాడు. సచిన్ జోస్యం చెప్పినట్టుగానే జరగడం గమనార్హం.