Begin typing your search above and press return to search.

ముంబై ఓటమికి కారణం అదే..! రోహిత్​పై సెహ్వాగ్​ ఫైర్​..!

By:  Tupaki Desk   |   25 April 2021 2:30 AM GMT
ముంబై ఓటమికి కారణం అదే..! రోహిత్​పై సెహ్వాగ్​ ఫైర్​..!
X
మాజీ క్రికెటర్​, డ్యాషింగ్​ ఓపెనర్​ వీరేంద్రసెహ్వాగ్​ ముంబై జట్టుపై మండిపడ్డారు. నిన్న పంజాబ్​ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్​ లో ముంబై బ్యాట్స్​మెన్స్​ దారుణంగా విఫలమయ్యారు. ఇటు ఓపెనర్లు, అటు మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్లు ఎవరూ సరిగ్గా ఆడలేదు. దీంతో ముంబై జట్టు చాలా తక్కువ స్కోర్​ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 131 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్కోరును పంజాబ్​ కింగ్స్​ అలవోకగా ఛేదించింది. కేవలం ఒక వికెట్​ నష్టానికి 17 ఓవర్లు పూర్తి కాక ముందే గెలుపొందారు.

అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్​ బ్యాటింగ్​ ఆర్డర్​ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫామ్​ లో ఉన్న సూర్యకుమార్​ యాదవ్​ను ఫస్ట్​ డౌన్​ లో ఎందుకు దించలేదంటూ వీరేంద్ర సెహ్వాగ్​ ప్రశ్నించారు. సూర్యకుమార్​ ప్లేస్​ లో ఇషాన్ కిషన్​ను దించడంతో అతడు సరిగ్గా ఆడలేకపోయాడు. దీంతో జట్టు పెద్దగా స్కోర్​ చేయలేకపోయింది. మరోవైపు హార్ధిక్​ పాండ్యా, కృనాల్​ పాండ్యా కూడా వెంట వెంటనే అవుట్​ అయ్యారు. 17 బంతులాడిన ఇషాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పవర్ ప్లేలో 21 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్​ లో ముంబైకి ఇదే అత్యల్ప స్కోరు.

దీనిపై వీరేంద్రసెహ్వాగ్​ స్పందిస్తూ.. ' ముంబై ఇండియన్స్​ జట్టు ఓ తప్పుడు ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఫామ్​ లో ఉన్న సూర్యకుమార్​ను ఫస్ట్​ డౌన్​ లో బ్యాటింగ్​ కు తీసుకురాకపోవడం పెద్ద తప్పు. ఇషాన్ కిషన్​ ప్లేస్​ లో సూర్యకుమార్​ వచ్చి ఉంటే పవర్​ ప్లేలో ముంబై ఎక్కువ పరుగులు సాధించేది. దీంతో ఆఖరున వచ్చే బ్యాట్స్​మెన్లు ఒత్తిడి లేకుండా ఆడేవాళ్లు. అప్పుడు ముంబై జట్టు కనీసం 150 కంటే ఎక్కువ పరుగులు చేసేది' అంటూ సెహ్వాగ్​ పేర్కొన్నాడు.

సెహ్వాగ్​ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్​ అజయ్​ జడేజా సైతం ఏకీభవించాడు. ముంబై ఇండియన్స్​ ఓ తప్పుడు ప్రణాళికతో ముందుకెళ్తున్నదని చెప్పాడు. నిన్నటి మ్యాచ్‌ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా అంతా విఫలమయ్యారు. దీంతో విమర్శలు వస్తున్నాయి.