Begin typing your search above and press return to search.
జగన్‌ను వినాయక్ కలిసింది అందుకేనా...!
By: Tupaki Desk | 7 Nov 2019 6:19 AM GMTజగన్ ఏపీలో ఏకంగా 151 సీట్లతో విజయం సాధించాక ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ వెళ్లి కలవలేదన్న విమర్శలు ఉన్నాయి. పృథ్వి లాంటి వాళ్లు ఈ విషయంలో తీవ్రంగా విమర్శలు చేశారు. ఇటీవల సైరా సినిమా చూడాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో సహా జగన్ ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. సురేష్‌బాబు లాంటి నిర్మాతలు తాము గతంలోనే జగన్ అపాయింట్‌మెంట్ కోరినట్టు కూడా చెప్పారు. అయినా వారు కలవలేదు.
ఇక ఇప్పుడు సెడన్‌గా వినాయక్ జగన్‌ను కలవంతో పాటు ఏకంగా అరగంట పాటు చర్చించుకోవడంతో రాజకీయంగా కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందే వినాయక్ రాజమహేంద్రవరం నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఈ ఎన్నికల్లో అక్కడ ఎంపీగా మార్గాని భరత్ రామ్ పోటీ చేసి విజయం సాధించారు. వినాయక్ కుటుంబం అంతా వైసీపీలోనే ఉంది... వాళ్లంతా ఈ ఎన్నికల్లో భరత్ విజయం కోసం కృషి చేశారు.
ఇక వినాయక్‌కు ముందు నుంచి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు కుటుంబంతో అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఆయన తనయుడు ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాకు జగన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. రాజా ప్రమాణస్వీకార సమయంలో కూడా వినాయక్ వచ్చారు. ఇక జగన్‌ను నమ్ముకున్నందుకు జక్కంపూడి ఫ్యామిలీకి తగిన న్యాయం చేశారని కూడా వినాయక్ గతంలోనే కొనియాడారు.
ఇక తాజాగా సీఎం జగన్‌తో భేటీ వెనక వినాయక్ కుటుంబసభ్యుల రాజకీయ భవితవ్యం దృష్ట్యా జగన్‌ను కలిశారనే వాదన వినబడుతోంది. మరోవైపు వినాయక్ క్యాంప్ మాత్రం మర్యాద పూర్వకంగానే కలిసిందని చెపుతున్నా... ఏదో పెద్ద ప్లాన్ ఉంటేనే వినాయక్ లాంటి అగ్రదర్శకులు ముఖ్యమంత్రిని కలవరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అటు వినాయక్ సైతం జగన్‌తో భేటీ విషయాలను ప్రస్తావించకపోవడంతోనే ఈ చర్చలు అన్ని నడుస్తున్నాయి.