Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రెండ్ షిప్ కటీఫ్ చేసిన ఎంఐఎం అసద్.. కారణం అదేనా?

By:  Tupaki Desk   |   11 Dec 2022 1:30 PM GMT
కేసీఆర్ ఫ్రెండ్ షిప్ కటీఫ్ చేసిన ఎంఐఎం అసద్.. కారణం అదేనా?
X
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పాలు నీళ్లలా కలిసిపోయిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జాతీయ రాజకీయాల్లో మాత్రం తమ దారులు వేరు అని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ కు తెలంగాణలో సపోర్ట్ చేస్తున్న అసద్.. జాతీయ రాజకీయాల్లో మాత్రం ఆయనతో కలిసేది లేదని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లో కలిసివచ్చే వారందరినీ కలుపుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు.

కర్ణాటకలో ఇప్పటికే జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా బీఆర్ఎస్ తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ తరుఫున ప్రకాష్ రాజ్ కు బాధ్యతలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

అయితే గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సహకారం అందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మాత్రం ఇప్పుడు ఆయన వెనుక కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్ తో కలిసి మజ్లిస్ నడుస్తుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మజ్లిస్ అధినేత అసద్ తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకునే పోటీ చేతున్నారు. కానీ బీఆర్ఎస్ తో కలిసేందుకు అసద్ ఆసక్తి చూపించడం లేదు.

హైదరాబాద్ పాతబస్తీ నుంచి దేశవ్యాప్తంగా ముస్లిం ప్రాబల్యమున్న అన్ని రాష్ట్రాల్లో పోటీచేసి ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కింది స్థాయి సీట్లను అసద్ గెలుస్తూ వస్తున్నారు. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారని విమర్శలు వచ్చినా అంతటా పోటీచేస్తున్నారు.

మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఓటమికి ఎంఐఎం భారీగా చీల్చిన ముస్లిం ఓట్లు కీలకమయ్యాయి. అక్కడ మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. బీహార్ లోనూ గెలిచారు. ఇక్కడా అలానే చీల్చారు. అందుకే బీఆర్ఎస్ నీడలో వద్దని అసద్ భావిస్తున్నారు.

అయితే బీఆర్ఎస్ పై ముస్లిం ముద్రపడితే బీజేపీ టార్గెట్ చేసి దెబ్బతీస్తుందని.. అందుకే అసద్-కేసీఆర్ వ్యూహాత్మకంగా దూరంగా పెడుతున్నారని తెలుస్తోంది. హిందుత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఈ విషయంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేయకుండా కేసీఆర్ ఇలా వ్యూహాత్మకంగా దూరం పెట్టారని అంటున్నారు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా కలుపుకుంటారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.