Begin typing your search above and press return to search.
ఆ కారణంతోనే కేసీఆర్ నోటి నుంచి రాజీనామా మాట వచ్చిందట
By: Tupaki Desk | 1 Nov 2020 5:50 AM GMTఆరోపణలు ఎన్ని వచ్చినా సరే.. పెద్దగా రియాక్టు కాని కూల్ సీఎంగా కేసీఆర్ ను చెప్పొచ్చు. అలా అని ఎవరేమన్నా లైట్ తీసుకుంటారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ప్రతి ఒక్కరి చిట్టాను జాగ్రత్తగా మొయింటైన్ చేస్తూ.. ఎవరికి ఎప్పుడు లెక్క చెప్పి వడ్డీతో సహా బదులు తీర్చుకునే తత్త్వం కేసీఆర్ సొంతం. తనది కాని టైంలో రియాక్టు అయ్యే గుణం ఏ మాత్రం కనిపించదు. అలాంటి కేసీఆర్.. తాజాగా మాత్రం ఒకింత ఎమోషనల్ అయి.. నా మాట తప్పని చెబితే.. నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా అన్న భారీ మాటను అస్త్రంగా సంధించారు. ఎందుకలాంటి మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చిందంటే.. దుబ్బాక ఉప ఎన్నికనే చెప్పాలి.
గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని టీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. అలవోకగా విజయం సాధిస్తామన్న దుబ్బాక ఉప ఎన్నిక అంచనాలు పూర్తిగా తప్పు కావటమే కాదు.. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచార ప్రభావం ఎంతన్నది గులాబీ దళానికి బాగా అర్థమైంది. దీంతో.. వారు ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నా ఫలించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. దుబ్బాకలో పరిస్థితి అంతకంతకూ మారిపోతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇప్పటివరకు మంత్రి హరీశ్ ఒంటరియుద్ధం చేస్తూ.. దుబ్బాక విజయం కోసం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆయన బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్నితిప్పి కొడుతున్నారు. అయినప్పటికీ.. ప్రజల్లో నమ్మకం కలగటం కోసం.. బీజేపీనేతలు చేస్తున్న ప్రచారంలో పస లేదన్న విషయాన్ని మరింత స్పష్టం చేసేందుకు సీఎమ్మే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
తాజాగా రైతు వేదికల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కమలనాథుల తీరును తీవ్రంగా ఖండించారు. కేంద్రమే మొత్తం ఫించన్లు ఇస్తుందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని.. అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 38 లక్షల మందికి నెలకు రూ.2016చొప్పున పింఛను అందుతుందని.. అందులోకేంద్ర ప్రభుత్వం 7 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.200 చొప్పున సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పింఛన్ల రూపంలోనే ఏడాదికి రూ.10 నుంచి రూ.12వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్ు చెప్పారు. తాను చెప్పిన లెక్కలు కాగ్ చెప్పేవే అని.. కావాలంటే చెక్ చేసుకోవచ్చన్నారు. తాను చెప్పిన మాట అబద్ధమని నిరూపిస్తే.. మరు నిమిషంలో తాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న భారీ సవాలును విసిరారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో కమలనాథులుచేస్తున్న ప్రచారాన్ని దుబ్బాక ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మటం మొదలైందని.. దీనికి వెంటనే చెక్ పెట్టే.. భారీ నష్టం జరగకుండా ఉండేందుకే కేసీఆర్ నోట రాజీనామా మాట వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఇంత తీవ్రస్థాయిలో కేసీఆర్ సవాలు విసరటం ఈ మధ్య కాలంలో ఇదేనన్న మాట వినిపిస్తోంది.