Begin typing your search above and press return to search.
ఆ ఖమ్మం మాజీ మంత్రి 29న టీడీపీలోకి ఖాయం
By: Tupaki Desk | 27 Dec 2022 2:30 PM GMTఖమ్మం జిల్లా రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఆయన పాత్ర కీలకం. ఓ దశలో ఉమ్మడి జిల్లా టీడీపీ మొత్తాన్ని తన కనుసైగతో నడిపించారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలోనూ కలిసి కదిలారు. అలాంటి నాయకుడు 2018 ఎన్నికల తర్వాత అప్రాధాన్యం ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తలపండిన ఆయన.. ఈ పరిస్థితిని ఉక్కపోతగా భావిస్తున్నారు. అధికార పార్టీ నుంచి.. తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ అయ్యాక తొలి వికెట్ ఆయనే..
తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన సంగతి తెలిసిందే. దసరా నాడు దీనికి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఢిల్లీ స్థాయిలో ఇతర పార్టీలతో సంప్రదింపుల ప్రయత్నాలు సాగుతున్నాయి. కాగా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు గత మూడేళ్లలో తెలంగాణ అధికార పార్టీ నుంచి పెద్దఎత్తున బీజేపీలోకి వలసలు సాగాయి. మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో, తర్వాత బీఆర్ఎస్ ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వెలుగులోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి
వెళ్లేవారు ఎవరూ కనిపించడం లేదు. అయితే, ఈ వ్యవధిలో టీడీపీ తెలంగాణ పూర్వ వైభవానిక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖమ్మం జిల్లాలో ఇటీవల భారీ సభ నిర్వహించింది. దీంతోనే తెలంగాణలో టీడీపీకి ఇంకా నూకలు ఉన్నాయనే సంగతి తెలిసిపోయింది. ఈ ఊపును కొనసాగించేలా ఖమ్మం జిల్లా సీనియర్ నేత అధికార బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి తిరిగి వస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఆయన ఒక్కరే టీడీపీలోకి పునరాగమనం చేస్తారా? లేక ఇద్దరు ముగ్గురు కీలక నాయకులనూ తనతో పాటు తీసుకువస్తారా? అన్నది కీలకంగా మారనుంది.
ఆయనొస్తే సమీకరణాలు మారిపోతాయ్..
ఖమ్మం జిల్లా సీనియర్ నేత గనుక టీడీపీలోకి పునరాగమనం చేస్తే ఆ ఉమ్మడి జిల్లాలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. తెలంగాణ టీడీపీ పగ్గాలను ఇటీవల కాసానికి అప్పగించి స్పీడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇదే క్రమంలో పార్టీ బలోపేతంపైనా ఆలోచనలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ మాజీ మంత్రి గనుక టీడీపీలోకి వస్తే సమీకరణాలు చాలావరకు మారిపోతాయి. ఉమ్మడి ఖమ్మంతో పాటు వారి సామాజికవర్గం
అధికంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలను ఆ మాజీ మంత్రి తన ప్రభావంతో నియంత్రించగలరు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారబోతోంది.
ఆ మాజీ మంత్రి జనవరి 29న హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో టీడీపీలోకి తిరిగి వస్తారని కచ్చితంగా చెబుతున్నారు. తెలంగాణలో బలపడి.. ఇక్కడ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీని.. ఆంధ్రాలో తన దారిలోకి తెచ్చుకోవాలనే వ్యూహంతో ఉన్న చంద్రబాబుకు ఆ మాజీ మంత్రి టీడీపీలో చేరిక పెద్ద బలాన్నిచ్చేదే కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.