Begin typing your search above and press return to search.
తెలంగాణ నాట సంచలనంగా ఆ పత్రిక కథనం.. కేసీఆర్ కు అలాంటి షాక్
By: Tupaki Desk | 4 Jan 2021 11:35 AM GMTనిజానికి అదో చిన్న పత్రిక. దాని గురించి పెద్దగా చర్చ ఉండదు. ఆ పత్రికలో పబ్లిష్ అయ్యే కథనాలు అంత ప్రాచుర్యం పొందదు కూడా. అలాంటి ఆ పత్రిక ఈ రోజు సంచలనంగా మారింది. అందుకు కారణం.. వారు పబ్లిష్ చేసిన కథనమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోయేలాంటి షాక్ ఇచ్చేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా పేర్కొంది. అందుకు ఏమేం చేసిందన్నది ఆ పత్రిక కథనం.
ఇంతకీ అందులోని పాయింట్ ఏమంటే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తగా.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేర్కొనే మైహోం కన్ స్ట్రక్షన్స్సంస్థ అధినేత అయిన జూపల్లి రామేశ్వరరావును బీజేపీలోకి తీసుకునేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీవీ9 మీడియా సంస్థతో పాటు.. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫాం కూడా ఆయనదే. కొన్ని వేల ఎకరాలకు అధిపతిగా ఆయనకు పేరుంది.
అలాంటి ఆయన్ను బీజేపీలో చేర్చుకున్న తర్వాత రాజ్యసభకు పంపుతారన్న ఆఫర్ ఇచ్చినట్లుగా పేర్కొంది. 2020 జులైలో ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లోని ఆయన జూబ్లీహిల్స్ నివాసం.. కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఇది కూడా ఆయన బీజేపీలో చేరాలనుకునేందుకు డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు.
ఈ మధ్యనే (గత ఏడాది అక్టోబరు 7న బీజేపీ కార్యాలయంలో) బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. మైం హోం రామేశ్వరరావు రిజర్వు ఫారెస్టులో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలన్నారు కూడా. ఈ అంశంపై కేంద్రంఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు కూడా. పర్యావరణ అనుమతులు లేకుండా మైహోం కంపెనీ మైనింగ్ చేస్తుందని ఆరోపించారు. ఒకరు తీసుకున్న అనుమతులతో మరొకరు మైనింగ్ చేస్తే సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. అందుకే ఈ వ్యవహారంలోనే కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. ఇలాంటి అంశాల్ని సెటిల్ చేసేందుకు వీలుగా కమలం గూటికి చేరే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. సీఎం కేసీఆర్ ఆర్థిక మూలాలపై భారీ ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని సదరు పత్రిక పేర్కొంది. మరేం జరుగుతుందో చూడాలి.