Begin typing your search above and press return to search.
ఆ వార్తలు.. నిజ్జంగా అబద్ధాలే.. ప్రపంచ ఆరోగ్య సంస్థే తేల్చేసింది!
By: Tupaki Desk | 9 May 2021 3:30 AM GMTసోషల్ మీడియా వేదిక ప్రజలకు ఎంత మేలు చేస్తోందో.. అదే సమయంలో అంతే ఆవేదనకు, గందరగోళానికి కూడా కారణం అవు తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలను సరైన విధంగా గైడ్ చేయాల్సిన సోషల్ మీడియా.. లెక్కలేనన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తోందని.. అదిగో పులి.. అంటే ఇదిగో తోక! అన్న చందంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. దీంతో నిజమైన పోస్టులను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఓ ఖచ్చితమైన అబద్ధం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే హుటాహుటిన స్పందించింది.
తాజాగా కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏంటంటే.. 5జీ స్పెక్ట్రమ్(మొబైల్ ఫిఫ్త్ జనరేషన్) టెస్టింగ్ వల్లనే వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభం అయ్యిందని.. పైగా దీన్ని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బిహార్, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జనాలు మరణించారని ఆడియోక్లిప్‌లో ఉంది. ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో దీనిపై నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఆదేశాల మేరకు ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో(పీఐబీ) రంగంలోకి దిగింది. వీటిలో వాస్తవమెంతో తేల్చేందుకు టెలికామ్ అధికారులను కలిసింది.
ఈ వార్తలపై టెలికామ్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ పుకార్లని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్(టీఏఐపీఏ) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ కొన్ని ప్రాంతీయా మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించింది.. 5 జీ టెక్నాలజీకి, కోవిడ్ -19 కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని సీఐఐఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. సో..
తెల్లనివన్నీ పాలు కానట్టే.. సోషల్ మీడియాలో తెగవైరల్ అయినంత మాత్రాన.. అవి నిజాలు కావని అంటున్నారు పరిశీలకులు.