Begin typing your search above and press return to search.

ఆ ..ఒక్క శాతం ఓటు జ‌గ‌న్ దే.. ప్రెసిడెంట్ పోల్ !

By:  Tupaki Desk   |   22 March 2022 2:30 AM GMT
ఆ ..ఒక్క శాతం ఓటు జ‌గ‌న్ దే.. ప్రెసిడెంట్ పోల్ !
X
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కార‌ణంగా రాజ‌కీయ ప‌రిణామాలు కానీ స‌మీక‌రణాలు కానీ మారేందుకు అవ‌కాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మ‌న‌కు ద‌క్కాల్సిన‌వి ఏవో మ‌న‌కు ద‌క్కేందుకు ఉన్న దారుల‌న్నీ అన్వేషిస్తే ఇప్పుడొక ద‌గ్గ‌ర దారి ఒక‌టి క‌నిపిస్తోంది.అదే కొత్త రాష్ట్రప‌తి ఎన్నిక. కానీ మ‌న పాల‌కులు దీనిని ఏ విధంగా వాడుకుంటారో అన్న‌ది ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం అని ఏపీ కాంగ్రెస్ అంటోంది. వీలున్నంత వ‌ర‌కూ హ‌క్కుల సాధ‌న కోసం ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టం అమలు కోసం ప‌నిచేయాల్సిన ఎంపీలు ఆ ప‌ని మ‌రిచిపోయి వ్య‌వ‌హ‌రిస్తున్నారన్న అభియోగం ఒక‌టి ఎప్ప‌టి నుంచో విప‌క్షం నుంచి ఉంది.

అది త‌ప్పు అని నిరూపించేందుకు రానున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటింగ్ విష‌య‌మై కాస్త‌యిన బెట్టు చేసి, బీజేపీని దార్లోకి తెస్తే ఫ‌లితాలు ఉంటాయి. కానీ ఆ విధంగా చేయాలంటే ముందు జ‌గ‌న్ పార్టీ అందుకు త‌గ్గ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకోవాలి..అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఊర‌క‌నే బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం క‌న్నా, ఇదే అదునుగా రాష్ట్రానికి ద‌క్కే నిధుల విష‌య‌మై పోట్లాడి సంబంధిత ప్ర‌జా ప్ర‌యోజ‌నం లేదా సామాజిక ప్ర‌యోజ‌నం వీలైనంత త్వ‌ర‌గా పొందాల‌ని వైసీపీకి సూచిస్తోంది ఏపీ కాంగ్రెస్.

ప్ర‌త్యేక హోదా కావాల‌న్నా, ఏపీకి రావాల్సిన నిధులు రావాల‌న్నా జ‌గ‌న్ చేతిలోనే అంతా ఉంది. జ‌గ‌న్ చేత‌లోనే అంతా ఉంది. ఎందుకంటే హోదా కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ ముగిసిపోయాయి క‌నుక ! ఇదే ద‌శ‌లో వ‌స్తున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను వైసీపీ త‌న‌కు అనుగుణంగా కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌ధాన డిమాండ్ల సాధ‌న‌కు వినియోగించుకుంటే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఎప్ప‌టిలానే జ‌గ‌న్ మ‌రోసారి తిరుగులేని నేత అవుతారు. చంద్ర‌బాబు క‌న్నా స‌మ‌ర్థ నాయ‌కుడు తానే అని మ‌రోమారు నిరూపించుకునేందుకు మంచి అవ‌కాశం ఒక‌టి వ‌రించింది. దీనిని జ‌గ‌న్ త‌న వ్యూహంతో వాడుకోవాలి.

స‌మ‌ర్థ‌నీయ ధోర‌ణిలో ప‌నిచేసి పేరు తెచ్చుకోవాలి..అని కాంగ్రెస్ హితవు చెబుతోంది. ఇత‌ర విప‌క్ష స‌భ్యులు కూడా ఇదే సంద‌ర్భంలో రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రాన్ని అడిగి ద‌క్కించుకుంటే మేలు అన్న భావ‌న‌నే వ్య‌క్తం చేస్తోంది.అసలు బీజేపీ అడిగినా, అడ‌గ‌క‌పోయినా ప‌లు సంద‌ర్భాల్లో ఉత్తి పుణ్యానికే మ‌ద్దతు ఇచ్చి మోడీపై ఎన‌లేని స్వామి భ‌క్తి చాటుకున్న వైసీపీ ఇక‌పై ఎలా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ది అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం..అని విప‌క్ష స‌భ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ద‌శ‌లో రాబోయే కాలానికి కాబోయే రాష్ట్ర‌ప‌తి ఎవ‌రు అన్న‌ది నిర్ణ‌యించే శ‌క్తి దేశంలో ఏ రాజ‌కీయ పార్టీకి లేనంత‌గా వైఎస్ జ‌గ‌న్ కు ద‌క్కింది.లేదా సంబంధిత వ‌రం ఆయ‌న్నే వ‌రించింది.దీంతో ఆయ‌న ఎన్నో మంచి ప‌నులు చేయ‌వ‌చ్చు.వ‌రం క‌దా !వినియోగించుకునే రీతిలో వినియోగించుకుంటే మంచి ఫ‌లితాలే ఉంటాయి. కానీ ఆయ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారో లేదా స్వార్థ ప్ర‌యోజ‌నాలే వెతుక్కుంటారో ఎవ‌రికి ఎరుక? అన్న‌ది ఇవాళ కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వాద‌న‌.

"వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి..ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి...అది ఎలా అంటే.. ఈ ఏడాది జులై లో జరగబోవు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి 1.2 శాతం ఓట్లు తక్కువగా ఉండడమే..కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి జగన్ మద్దతు తప్పకుండా అవసరం పడుతుంది..అప్పుడు జగన్ ! మీకు అంటే ఎన్డీఏ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థికి మద్దతు ఇవ్వాలంటే..? ప్రత్యేక హోదా... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా ఆపడం..విభజన హామీలు లాంటి అంశాలు మోడీ ముందు పెడితే తప్పకుండా మనకు ప్రత్యేక హోదాతో పాటు ఏపీ ప్రజలు కోరుకున్నవన్నీ జగన్ ప్రభుత్వం నెరవేర్చవచ్చు..." అని కూడా అంటోంది కాంగ్రెస్.