Begin typing your search above and press return to search.
గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ థర్డ్ ప్లేస్...?
By: Tupaki Desk | 20 Sep 2022 2:30 AM GMTగోదావరి జిల్లాల అన్నం ఈ రాష్ట్రం తింటోంది. గోదావరి నీళ్ళు చాలా జిల్లాలు తాగుతాయి. గోదావరి వారి మాట కూడా ఏపీ అంతా వింటుంది. ఆ మాటకు వస్తే ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి గోదావరి దారే మాది అని 23 జిల్లాలూ భావించి తీర్పు చెప్పేవి. విభజన తరువాత అదే సంప్రదాయం కొనసాగుతోంది. 2014లో గోదావరి జై టీడీపీ అంటే 2019 నాటికి ఫ్యాన్ పార్టీని గుర్రున తిప్పేశాయి.
ఇక ఇపుడు చూస్తే గోదావరి జిల్లాలు మరోమారు భిన్నమైన వాతావరణం కనీప్స్తోంది. ఇక్కడ అనూహ్యంగా జనసేన పుంజుకుంది. అది ఎంతలా అంటే ఏపీలో ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే టీడీపీని తోసిరాజని ముందుకు సాగుతోంది. వైసీపీకి ధీటైన ప్రతిపక్షంగా అనేక నియోజకవర్గాలలో ఉందిపుడు. కాకినాడ జిల్లాలో చూసుకుంటే ఉన్న ఏడు సీట్లలో అన్ని చోట్లా వైసీపీకి సరిసమానంగా జనసేన ఊపు కనిపిస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి.
అదే సమయంలో టీడీపీ మాత్రం థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పెద్దాపురంలో మాత్రం టీడీపీ జనసేన పక్కపక్కనే ఉన్నాయి. కాకినాడ సిటీ, రూరల్, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట లాంటి చోట్ల జనసేన స్పీడ్ బాగా ఉంది. ఇక పిఠాపురంలో అయితే వైసీపీని మించేలా సీన్ కనిపిస్తోంది. ఈ సీట్లు అన్నింటా టీడీపీని జనసేన బాగా వెనక్కి నెట్టేయడం విశేషం.
అలాగే రాజమండ్రి రూరల్ లో బలంగా ఉంది. సిటీలో కూడా పటిష్టంగా కనిపిస్తోంది. నర్సాపురం, భీమవరం, రాజోలు వంటి పశ్చిమ గోదావరి సీట్లలో కూడా జనసేన మరొకరి ప్రమేయం లేకుండా వైసీపీని ఢీ కొట్టగలమని చెబుతోంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీని ఓడించాలన్న కసితో జనసేన దూకుడు ఎక్కువగా ఉంది. మరో ఇరవై నెలల్లో ఎన్నికల సమాయనికి జనసేన మరింతగా పుంజుకోవడం ఖాయమనే అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యం చూస్తూంటే గోదావరి జిల్లాలలో ఉన్న 34 సీట్లలో ఎక్కువ సీట్లు జనసేన పరం అవడం ఈసారి ఖాయమని అంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఎంతో బలంగా ఉంటూ దశాబ్దాలుగా టీడీపీకి కొమ్ము కస్తున్న పల్లెలు ఈసారి జనసేనకు జై కొట్టడం.
ఇక అధికార వైసీపీ కాబట్టి బలంగా ఉంది. అదే టైంలో టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉంటే మాత్రం వైసీపీని అధిగమించి ముందుకు దూకుతాయి. అయితే పొత్తులు అవసరం అయితే టీడీపీకే ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పాలి. మరి పొత్తులు అనివార్యం అని టీడీపీ కనుక అనుకుంటే గోదావరిలో జనసేన దూకుడు చూసే అనుకోవాలేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.