Begin typing your search above and press return to search.

యోగీపై మండిపోతున్న ఆ సామాజికవర్గం

By:  Tupaki Desk   |   6 Feb 2022 8:30 AM GMT
యోగీపై మండిపోతున్న ఆ సామాజికవర్గం
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ దగ్గరపడేకొద్దీ కొత్త విషయాలూ బయటపడుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ పై బ్రాహ్మణ సామాజికవర్గం బాగా మంటమీదున్న విషయం తెలిసింది. మొదటినుండి కూడా బ్రాహ్మణ సామాజికవర్గం కాంగ్రెస్ తో ఉండేది. అయితే ఆ తర్వాత బీజేపీకి ఫిఫ్టయ్యింది. ప్రస్తుతం బ్రాహ్మణుల్లోని మెజారిటి ఓటర్లు బీజేపీతోనే ఉన్నారు. అయితే యోగి సీఎం అయిన తర్వాత జరిగిన డెవలప్మెంట్లతో ఈ సామాజికవర్గం బాగా మంటమీదుందట.

బ్రాహ్మణులను యోగి కావాలనే ఇబ్బంది పెడుతున్నాడని, పైకి రానీయకుండా తొక్కిపెడుతున్నాడంటు బ్రాహ్మణసంఘాలన్నీ బాగా మండిపోతున్నాయట. తమ ఆరోపణలకు కావాల్సిన ఆధారాలను కూడా బ్రాహ్మణ సంఘాలు, ప్రముఖులు చూపిస్తున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి 10 శాతం ఓట్లున్నాయి. అలాగే రాజపుట్ (ఠాకూర్) వర్గం ఓట్లు 8 శాతం ఉన్నాయి. యోగి ఠాకూర్ వర్గానికి చెందిన వ్యక్తి.

గోరఖపూర్ లో బ్రాహ్మణ నేతలను ఎదగనీయకుండా యోగి తొక్కేస్తున్నాడంటు చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా అనేక సందర్భాల్లో యోగి దెబ్బకు ఎంతమంది బ్రాహ్మణ నేతలు ఇబ్బంది పడ్డారో ఉదాహరణలతో సహా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బీజేపీ అగ్రనేతలు నలుగురు బ్రాహ్మణులతో కమిటి వేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదట. ఇందులో భాగంగానే బ్రాహ్మణులను దగ్గర చేసుకునేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పావులు కదుపుతున్నారు.

గోరఖపూర్లో యోగి బద్దశతృవైన హరిశంకర్ తివారి కొడుకు వినయ్ శంకర్ తివారికి టికెట్ ఇచ్చారు. అలాగే హరిశంకర్ ద్వారా 40 బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జ్యోతిష్యం శాస్త్రం, సంస్కృతం భాషా వ్యాప్తిలో రిజర్వేషన్ కల్పిస్తానని హామీఇచ్చారు. అలాగే బ్రాహ్మణులకు మరికొన్ని టికెట్లు కూడా కేటాయించారు. దాంతో బ్రాహ్మణుల్లో చీలిక రావచ్చనే ప్రచారం మొదలైంది. 2017 ఎన్నికల్లో బ్రాహ్మణుల్లో 80 శాతం బీజేపీకి ఓట్లేశారని అంచనా. మరి రాబోయే ఎన్నికల్లో ఎంతమంది ఓట్లేస్తారో చూడాలి.