Begin typing your search above and press return to search.

చెన్నైలోని ఆ స్టార్ హోటల్.. కరోనాకు కేరాఫ్ అడ్రస్

By:  Tupaki Desk   |   4 Jan 2021 11:34 AM GMT
చెన్నైలోని ఆ స్టార్ హోటల్.. కరోనాకు కేరాఫ్ అడ్రస్
X
చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించి షాకింగ్ అంశం బయటకు వచ్చింది. కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ మధ్యనే చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో కరోనా కలకలం రేగగా.. తాజాగా లీలా ప్యాలెస్ స్టార్ హోటల్ ఉన్నట్లుగా గుర్తించారు. తాజాగా ఆ హోటల్ సిబ్బంది.. కుటుంబ సభ్యులు.. వారి ఇరుగుపొరుగు వారిలో 85 మంది కరోనా బారిన పడటంతో షాకింగ్ గా మారింది.

దీంతో అలెర్టు అయిన ప్రభుత్వం.. నగరంలోని అన్ని హోటళ్లలో కరోనా పరీక్షల్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో లీలా ప్యాలస్ లోని 232 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో పది శాతం మందికి వైరస్ ఉన్నట్లుగా తేలింది. చెన్నై మహానగరంలోని అన్నిఫైవ్ స్టార్ హోటళ్లలో కలిపి 6416 మంది సిబ్బంది విధుల్ని నిర్వహిస్తున్నారు. వీరిలో మూడు శాతం మందికి పాజిటివ్ గా తేలింది. మరో 491 మందికి ఫలితాలు రావాల్సి ఉంది.

చెన్నై దరిద్రం ఏమో కానీ.. కరోనా క్లస్టర్లుగా కొన్ని కీలక ప్రాంతాలు మారటంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. డిసెంబరులో ఐఐటీ మద్రాసులో కరోనా కేసులు భారీగా బయపడ్డాయి. ఆ ఒక్క క్యాంపస్ లోనే వందకు పైగా విద్యార్థులు కరోనా పాజిటివ్ గా తేలటంతో దాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఇప్పుడు స్టార్ హోటల్ పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉండటం అధికారుల్ని.. ప్రభుత్వాన్ని హడలెత్తిస్తోంది.