Begin typing your search above and press return to search.

అదీ గంభీర్ అంటే.. ఐనా ఎంపీగా ఇది తగునా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 10:33 AM GMT
అదీ గంభీర్ అంటే.. ఐనా ఎంపీగా ఇది తగునా?
X
గౌతమ్ గంభీర్.. టీమిండియా మాజీ ఓపెనర్.. ప్రపంచ కప్ ల ఫైనల్స్ హీరో.. వన్డేలు, టి20ల్లో మంచి బ్యాట్స్ మన్.. అన్నిటికి మించి దూకుడు.. అది మైదానంలో అయినా, బయట అయినా..? ఇక పాకిస్థాన్ పై అయితే ఒంటికాలిపై లేస్తాడు. పాక్ క్రికెటర్లనూ అంతే తీవ్రంగా తప్పుబడుతుంటాడు. దాయాది దేశం మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికి గంభీర్ కు గతంలో జరిగిన సంవాదాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇక గంభీర్ డాషింగ్ ఓపెనింగ్ తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2004లో టీమిండియాలోకి వచ్చిన అతడు పదేళ్లు కీలక ఆటగాడిగా నిలిచాడు. సహచర ఢిల్లీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తో గంభీర్ భాగస్వామ్యాలు టీమిండియాను ప్రపంచ జట్లతో పోటీ పడేలా చేశాయి.

నిలువెత్తు దేశభక్తి గంభీర్ కు దేశభక్తి ఎక్కువ. మన సరిహద్దులను కాపాడే సైన్యం అంటే చాలా ఇష్టం. దీనిని అతడు ఎక్కడా దాచుకోలేదు కూడా. అంతేకాదు.. పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. గంభీర్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరాడు.

తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాడు. అంతకుముందే అతడికి పద్మశ్రీ అవార్డు దక్కింది. కాగా, ఎంపీ అయ్యాక పాకిస్థాన్ పై గంభీర్ విమర్శలకు ప్రాధాన్యం ఏర్పడింది. అతడు చేసే వ్యాఖ్యలు రాజకీయ నాయకుడి కోణంలో చర్చకు వచ్చేవి. తాజాగా గంభీర్ చేసిన పని మరింత చర్చకు తావిస్తోంది.

లంక జెండాతో మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ పై శ్రీలంక విజయం సాధించింది. స్వతహాగానే పాక్ ద్వేషి అయిన గంభీర్.. ఈ సందర్భంగా అనూహ్యమైన చర్యకు దిగాడు. ఈ మాజీస్టార్‌ ఆటగాడు ఏకంగా శ్రీలంక జాతీయ పతాకాన్ని పట్టుకొని మైదానంలోకి వెళ్లి పోజులిచ్చాడు. ఈ వీడియోను గంభీర్‌ స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీనికి ఆయన "సూపర్‌ స్టార్‌టీమ్‌.. నిజంగా అర్హులు #కంగ్రాట్స్‌శ్రీలంక" అనే శీర్షికను జోడించాడు. మ్యాచ్‌ అనంతరం గంభీర్‌ మైదానంలోకి వెళ్లి శ్రీలంక పతాకం పట్టుకొని లంక కెప్టెన్ షనాక టీమ్ కు అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా శ్రీలంక అభిమానులు కేరింతలు కొట్టారు.

ప్రజాప్రతినిధిగా సరైనదేనా? భీర్ ఇప్పుడు ఎంపీ. ఒకప్పుడంటే జాతీయ జట్టు ఆటగాడు. నాడు అతడు ఏం చేసినా చెల్లింది. తన వ్యాఖ్యలకు అక్కడివరకే పరిమితి ఉండేది. కానీ, ఓ ప్రజాప్రతినిధిగా అది కూడా ధికార పార్టీ ప్రజాప్రతినిధిగా అతడి చర్యలు చర్చనీయాంశం అవుతాయి.

ఓ అంతర్జాతీయ టోర్నీకి వెళ్లి.. విదేశీ జెండాను అదికూడా శత్రుదేశంపై విజయం సాధించిన నేపథ్యంలో పట్టుకోవడం అంటే మరింత చర్చనీయాంశమే. ఇప్పటికే గంభీర్.. శ్రీలంక జాతీయ పతాకం పట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చివరకు ఎక్కడకు వెళ్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.