Begin typing your search above and press return to search.
హోల్ సేల్ గా లోకేష్ కే.... అందుకే ఎన్టీయార్ కి తిట్లు
By: Tupaki Desk | 11 Oct 2022 9:31 AM GMTతెలుగుదేశం పార్టీ అస్తమించిన పార్టీగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. ఆ పార్టీ ఆరిపోతోందని, దాంతో ఎలాగైనా దాన్ని నారా లోకేష్ కి అప్పగించేయాలన్నదే బాబు ఆరాటమని కొడాలి మండిపడ్డారు. టీడీపీ విషయంలో జూనియర్ ని దూరం చేయడానికే విమర్శలు చేస్తున్నారని, ఆయన్ని దారుణంగా తిట్టిస్తున్నారని కొడాలి అంటున్నారు.
గుడివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మీద హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ డిఫాల్టర్ల పార్టీ అని అభివర్ణించారు. ఆ పార్టీని హోల్ సేల్ గా లోకేష్ పరం చేయడానికి జూనియర్ మీద పడ్డారని నాని అంటున్నారు. అమరావతి రాజధాని విశాఖపట్నానికి ఎక్కడైనా పోలిక ఉందా అని నాని ప్రశ్నించారు.
అమరావతి కేవలం ఇరవై తొమ్మిది గ్రామలకు చెందినదని, పాతిక లక్షల మంది ఉన్న అతి పెద్ద నగరం విశాఖ అని అలాంటి నగరం మీద పడి ఏడుస్తున్నారని విషం కక్కుతున్నారని నాని ఫైర్ అయ్యారు. విశాఖలో ప్రభుత్వ స్థలం రుషికొండ అని అక్కడ ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూంటే దోపిడీ అనడమేంటో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.
ఇక విశాఖ దసపల్లా భూములల్లో టీడీపీ ఆఫీస్ కట్టారని, అలాగే టీడీపీ నేతల ఆఫీసులు కూడా అక్కడే ఉన్నాయని, మరి ఆ భూములను వైసీపీ ఎంపీ ఎలా కబ్జా చేయగలడని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలను నిజాలుగా చేసే ప్రయత్నంలో చంద్రబాబు ఆయన మద్దతుదారులు ఉంటే అదే నిజమని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారని నాని మండిపడ్డారు.
విశాఖలో రాజధాని అన్న తరువాత భూముల ధరలు ఏమైనా పెరిగాయా అని ఆయన ప్రశ్నించారు. అదే అమరావతిలో ఎకరం భూమి ఏకంగా పది కోట్లకు ధర పెరిగింది అని గుర్తు చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పనిగట్టుకుని విశాఖ మీద బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ పార్టీ గురించి గొంతు చించుకుంటున్న డిఫాల్టర్స్ కి నిజాలు తెలియవని, అబధ్దాలే మాట్లాడుతూంటారని నాని కౌంటర్లేశారు. చేసే ఆరోపణలకు నిబద్ధత ఏమైనా ఉందా అని కూడా ఆలోచించుకోరంటేనే వారి దివాళాకోరుతనం అర్ధమవుతోందని నాని అంటున్నారు.
మొత్తానికి విశాఖలో భూములే లేవు, గజాల లెక్కన అమ్మలాకు జరిగే చోట భూముల రేట్లు పెంచుకోవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ జరపడం సాధ్యమేనా అని నాని లాజిక్ పాయింట్ తీస్తున్నారు. అదే విధంగా దసపల్లా భూముల్లో చాలా వాటిని ఏనాడో కొట్టేసి బడా బాబులు కట్టడాలు కట్టేశారని, వాటి ఊసు చెప్పకుండా వైసీపీ మీద ఈ నిందలేంటి అని ఆయన మండిపడుతున్నారు.
ఆయన అన్న మరో పాయింట్ విశాఖలో రుషికొండ పూర్తిగా టూరిజానికి చెందిన ఆస్తి. అక్కడ భవనాలు కడుతోంది కూడా టూరిజం డిపార్ట్మెంటే. మరి ఇందులో దోపిడీ ఏముంది అని ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీస్తున్నారు. జూనియర్ ని టీడీపీ నుంచి దూరం చేయడానికే తిట్ల వర్షం కురిపిస్తున్నారు అని మరో పాయింట్ లేవనెత్తారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని మళ్లీ ఫీల్డ్ లోకి వచ్చి బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. మరి కౌంటర్లు అవతల వైపు నుంచి ఎలా ఉంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.