Begin typing your search above and press return to search.
ఆ మహిళా ఎస్ఐ వయసు 35.. పెళ్లి కాలేదని అంత పని చేసింది
By: Tupaki Desk | 9 July 2021 5:30 AM GMTఅనుకుటాం కానీ.. పెళ్లి.. పిల్లలు పుట్టటం లాంటివి టైంకు జరిగిపోయిన వారికి తెలీదు కానీ.. అవన్నీ జరగాల్సిన సమయంలో జరగకపోతే ఉండే వేదన అంతా ఇంతా కాదు. అన్ని ఉండి.. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టకుంటే ఆ దంపతులు పడే వేదన ఒక ఎత్తు అయితే.. వారి కుటుంబ సభ్యులు.. బంధువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో కెరీర్ వల్ల కానీ.. ఇతర కారణాలతో పెళ్లి ఆలస్యమైతే చాలు.. అలాంటి వారు పడే వేదన అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైన ఒక మహిళా ఎస్ ఐ దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని రత్ లామ్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ బాద్యతలు నిర్వర్తిస్తున్నారు కవితా సోలంకి. విధినిర్వహణలో ఆమె పని తీరును అందరు ప్రశంసిస్తుంటారు. కమిట్ మెంట్ తో పని చేసే ఆమెను ఎవరు వేలెత్తి చూపించరు. అయితే.. ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. 35 ఏళ్లు ఉన్న కవితా సోలంకికి ఇంకా పెళ్లి కాలేదు. తరచూ ఆమె పెళ్లి అంశం హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అటు తల్లిదండ్రులు కానీ ఇటు బంధువులు కానీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవటాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు.
ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ఆమె సెలవు పెట్టి తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. కొద్ది రోజులు లీవ్ లో ఉండి.. తాజాగా ఆమె విధుల్లో చేరారు. తన అధికార నివాసంలో ఉన్న ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషం తాగిన వెంటనే.. స్నేహితురాలికి ఫోన్ చేసి తాను విషం తాగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో.. ఆమె హుటాహుటిన కవితా సోలంకి ఇంటికి వెళ్లారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.
ఆమె ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. ఆమె ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించగా షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. తనకు ఎందుకు పెళ్లి కాలేదంటూ అదే పనిగా అడిగే వారికి సమాధానం చెప్పి.. చెప్పి తాను అలిసిపోయానని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకున్నటన్లుగా సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెళ్లి కాలేదన్నది కూడా ప్రాణాలు తీసుకునేంత పెద్ద సమస్య? అని ప్రశ్నించొచ్చు. కానీ.. అలాంటి వేదనకు గురైన వారి మానసిక పరిస్థితి దారుణంగా ఉంటుందని చెబుతున్నారు.