Begin typing your search above and press return to search.
కేసీఆర్ తీరుతోనే కేంద్రం నిధులు రావట్లేదా?
By: Tupaki Desk | 3 Feb 2020 5:01 AM GMTవిషయం ఏదైనా చివరకు తమదే పైచేయి కావాలన్నట్లుగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాయం ఇచ్చేటోళ్లను చురుకైన మాటలు అనే విషయంలో అస్సలు వెనుకాడరు. నిధులు అవసరమై అడిగేటప్పుడు ఉండే మర్యాద.. తీసుకునేటప్పుడు ఉండకపోవటమే కాదు.. ఎవరికోసం ఇస్తారన్నట్లుగా మాట్లాడే మాటలు ఇప్పుడు కేంద్రానికి కన్నెర్రకు కారణమా? అన్నది క్వశ్చన్ గా మారింది.
యూపీఏ సర్కారుకు భిన్నమైనది మోడీ సర్కారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో యూపీఏ సర్కారు కాస్త బెటర్ అని చెప్పక తప్పదు. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండటమే కాదు.. రాజకీయ ప్రయోజనాలు లేని రాష్ట్రాల విషయంలో కరకుగా ఉండటమే కాదు.. ఎలాంటి మొహమాటం లేకుండా మొండిచేయి చూపించటం కనిపిస్తుంది.
రాజకీయంగా తమకు సానుకూలంగా లేని రాష్ట్రాల విషయంలో ఆసక్తి చూపని మోడీ సర్కారు.. తెలంగాణ రాష్ట్రం విషయంలో మరింత మొండిగా ఉంటారని చెప్పాలి. మీ ఆటలు ఎవరి దగ్గరైనా ఓకేనేమో కానీ.. మా దగ్గర మాత్రం చెల్లవన్న సంకేతాన్ని గులాబీ బాస్ కు ఇచ్చేట్లుగా ఉంటాయని చెప్పాలి. అదిలింది.. బెదిరించి.. ఎమోషనల్ గా బాధ్యల్ని చేస్తూ తమ పనులు పూర్తి చేసుకునే టీఆర్ఎస్ అలవాటుకు చెక్ పెట్టింది మోడీ సర్కారు.
ఏమన్నా.. ఎలాంటి బెదిరింపులకు దిగినా స్పందించకుండా ఉండటం.. నిధులు కేటాయింపు.. ప్రాజెక్టులు ఇచ్చే విషయంలో పినాసితనాన్ని ప్రదర్శించటమే కానీ పెద్దన్న మాదిరి వ్యవహరింకూడదన్నట్లుగా డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కేసీఆర్. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ తెలంగాణకు మొండిచేయి చూపటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గులాబీ బాస్.
ఈ కారణంతోనే మోడీ సర్కారుపై మండి పడుతున్నారు. నిధులు.. ప్రాజెక్టులు ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదు. మైలేజీ రాదు. ఇవ్వని కారణంగా నాలుగు తిట్లు తిడతారు అంతేగా? వారి మాటలకు భయపడి.. లొంగిపోయే ప్రసక్తే లేదంటూ బీజేపీ నేతలు కొందరు చేస్తున్న వాదనలు వింటే.. కేసీఆర్ ను డీల్ చేసే విషయంలో మోడీ పరివారానికి స్పష్టత ఉండాలని చెప్పక తప్పదు. యూపీఏ సర్కారును ఆడించినట్లుగా ఎన్డీయే సర్కారును ఆడించటం సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ కు ఇప్పటికే అర్థమైందని చెప్పాలి. అయితే.. మోడీ సాఫ్ట్ వేర్ తో ఎలా డీల్ చేయాలన్న విషయంలో గులాబీ బాస్ కు ఒక పట్టాన క్లారిటీ రావటం లేదని చెప్పక తప్పదు.