Begin typing your search above and press return to search.
మీ పాస్ వర్డ్ ఇవి అయితే ముప్పు తప్పదు?
By: Tupaki Desk | 21 Nov 2020 1:30 AM GMTఇప్పుడు దేశమంతా డిజిటల్ మయం అయ్యింది.. మోడీ సార్ పిలుపు మేరకు ఇప్పుడు రూపాయలు లెక్కబెట్టడం మాని అంతా ఫోన్లో వివిధ పే మార్గాల్లో ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. రోజురోజుకు ఇందులో సులభం కావడంతో కొబ్బరిబొండాల షాపు నుంచి కార్పొరేట్ మార్ట్ ల దాకా అంతా ఆన్ లైన్ చెల్లింపులే సాగుతున్నాయి.
ఇక ఈ చెల్లింపులతోపాటు సైబర్ నేరగాళ్లు కూడా చెలరేగిపోతున్నారు. యూజర్ నేమ్స్, పాస్ వర్డ్ లు గుర్తుపెట్టుకోవడం.. వాటిని కఠినంగా పెట్టుకోవడం ఇప్పుడు వినియోగదారుల ముందున్న అతిపెద్ద సవాల్ గా మారింది.
బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్ ఫోన్ స్క్ర్రీన్ లాక్ పాస్ వర్డ్ ఇలా అన్నింటిని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటి పాస్ వర్డ్ లు గుర్తు పెట్టుకోవాలంటే కష్టసాధ్యం. అందుకే చాలా మంది 12345 లాంటివి. లేదంటే పుట్టినరోజు తేదీలను పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటారు. ఇక్కడే సైబర్ హ్యాకర్లకు దొరికిపోతారని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ఇప్పటికీ ‘123456789’.. ‘ఐలవ్ యూ’ లాంటి హ్యాక్ టు హ్యాక్ పాస్ వర్డ్ లనే వాడుతున్నారట.. నార్డ్ పాస్ సంస్థ 2020 సంవత్సరానికి గాను అత్యంత చెత్త పాస్ వర్డ్ లను విడుదల చేసింది. దీని ప్రకారం ‘123456’ టాప్ లో ఉంది. ఈ ఏడాది 25,43,285 మంది ఇదే పాస్ వర్డ్ వాడుతున్నారు. ఇలాంటి పాస్ వర్డ్ లు ఉంటే తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్ , స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్ వర్డ్ లను మార్చుకోవాలని.. ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్ వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్ పాస్ సూచిస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్‌వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని సూచించింది.