Begin typing your search above and press return to search.

క‌రోనా నుంచి మ‌హిళ‌ల‌ను ఆ హార్మోన్ కాపాడుతుందట !

By:  Tupaki Desk   |   30 Aug 2020 12:30 AM GMT
క‌రోనా నుంచి మ‌హిళ‌ల‌ను ఆ హార్మోన్ కాపాడుతుందట !
X
కరోనా వైరస్ .. ప్రపంచంలో ఏ మూల ఈ పేరు వినిపించినా కూడా గుండెల్లో గుబులు మొదలౌతుంది. ఎందుకంటే ఆ మహమ్మారి ప్రభావం అలాంటిది మరి. చైనాలో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ , ఆ తర్వాత ఒక్కొక్క దేశం వ్యాప్తి చెందుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 24. 6 మిలియన్ కేసులు నమోదు అయ్యాయి. 8. 35 లక్షల మంది కరోనా భారిన పడి మరణించారు. ఇకపోతే క‌రోనా బారిన మ‌హిళ‌ల క‌న్నా పురుషులే ఎక్కువ‌గా ప‌డుతున్నార‌ట‌.

క‌రోనా ముప్పు పురుషుల‌కే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గ‌ణాంకాలు కూడా చెబుతున్నాయి. అయితే , దీనిపై అధ్య‌య‌నం చేసిన అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ బాప్టిస్ట్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. మహిళల్లో సెక్స్‌ హార్మోన్‌ ఈస్ట్రోజన్‌ వల్ల వైరస్‌ సోకే ముప్పు తక్కువగా ఉందని వారి ప‌రిశోధ‌న‌లో వెల్లడైంది. ఈ కరోనా వైరస్‌ సోకితే గుండె మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే, మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ గుండె సంబంధిత‌ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కరోనా మహమ్మారి ప్రభావం నేరుగా గుండె పై పడకుండా ఈస్ట్రోజన్‌ అడ్డుపడుతుందని, దీంతో వైరస్‌ సోకినా మహిళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని ప్రొఫెసర్‌ లియాన్నె గ్రోబన్‌ చెప్పారు.