Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ కోసం భారత టెకీని చంపేసిన అమెరికన్

By:  Tupaki Desk   |   4 April 2021 11:30 PM GMT
గర్ల్ ఫ్రెండ్ కోసం భారత టెకీని చంపేసిన అమెరికన్
X
అమెరికాలోని మిస్సౌరీలో భారత టెకీ దారుణ హత్యకు గురయ్యాడు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని 32 ఏళ్ల షరీఫ్ రెహమాన్ ఖాన్ గా అమెరికన్ పోలీసులు గుర్తించారు.

షరీఫ్ ది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ గా గుర్తించారు. షరీఫ్ సెయింట్ లూయిస్ లోని యూనివర్సిటీ సిటీ అపార్ట్ మెంట్ లో బుల్లెట్ గాయాలతో ఉండడం చూసి స్థానికులు 911 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు గాయాలతో ఉన్న షరీఫ్ ను చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షరీఫ్ మృతిచెందాడు.

షరీఫ్ వద్ద పోలీసులు కొంత సమాచారం రాబట్టారు. షరీఫ్ ను కాల్చింది స్థానికంగా ఉండే 23 ఏళ్ల కోల్ జే మిల్లర్ అని చెప్పాడు. దాంతో పోలీసులు మిల్లర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు.

షరీఫ్ స్నేహితురాలిలో మిల్లర్ కు శారీరక సంబంధం ఉందని.. బుధవారం కూడా ఈ ఇద్దరూ అదే విషయంపై ఆ యువతి ఉండే యూనివర్సిటీ సిటీ ఆపార్ట్ మెంట్ కు వెళ్లినప్పుడు ఘర్షణ పడ్డారు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో ప్రేమే ఈ ఇద్దరి మధ్య ఉద్రిక్తతకు కారణమై మిల్లర్ కాల్పులు జరడానికి కారణమైందని పోలీసులు తెలిపారు.

షరీఫ్ పై కాల్పులు జరిపి యువతితో యువతితో పాటు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. షరీఫ్ మృతితో స్వస్థలం భోపాల్ లోని సుభాష్ నగర్ లో విషాదం నెలకొంది.