Begin typing your search above and press return to search.

‘భరత్ అనే నేను’ రిపీట్: వాహనదారులకు జగన్ సర్కార్ షాక్

By:  Tupaki Desk   |   21 Oct 2020 5:30 PM GMT
‘భరత్ అనే నేను’ రిపీట్: వాహనదారులకు జగన్ సర్కార్ షాక్
X
‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబులాగే ఏపీ సీఎం జగన్ వాహనదారులపై కొరఢా ఝలిపించారు. ఆ సినిమాలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏకంగా 30వేల వరకు మహేష్ బాబు సీఎం హోదాలో జరిమానాలు విధించారు. ఇప్పుడు అదే సీన్ ను ఏపీలో సీఎం జగన్ రిపీట్ చేశారని వాహనదారులు కుయ్యో మొర్రో అంటున్నారు. మహేష్ అంత కాదు కానీ దాదాపు భారీ జరిమానాలనే జగన్ విధించేందుకు సిద్ధమయ్యారట..

కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబు ఖాళీ అవ్వక మానదు. భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ చేరింది.దీంతో ఏపీ వాహనదారులంతా ఇక ఒళ్లు దగ్గరపెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా నిబంధనల ప్రకారం వాహనాలు నడుపాలన్న మాట.. ఏ మాత్రం తేడా చేసినా ఆ భారీ జరిమానాలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

విశేషం ఏంటంటే.. బైక్ నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే విధమైన జరిమానాను విధించడం విశేషం. ఇక ఇతర వాహనాలకు అయితే ఇంకా వాచిపోయేలా భారీ జరిమానాలు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.

* ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం ప్రకారం జరిమానాలు ఇలా ఉన్నాయి.
- సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
-పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
- వేగంగా బండి నడిపితే – రూ. 1000
- రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
-రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
- వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
- ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
-అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
- రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి – రూ. లక్ష
-రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
-అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
-డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
-వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
- సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750
- అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
- ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం