Begin typing your search above and press return to search.

కాగ్ కొర్రీలు.. ఇప్పుడు కొత్తా బాబూ.. సీనియ‌ర్‌గా ఆలోచించ‌రాదా...?

By:  Tupaki Desk   |   29 Nov 2021 2:30 AM GMT
కాగ్ కొర్రీలు.. ఇప్పుడు కొత్తా బాబూ.. సీనియ‌ర్‌గా ఆలోచించ‌రాదా...?
X
ఏపీ ప్ర‌భుత్వంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా కేంద్ర ఆర్థిక గ‌ణాంకాల శాఖ‌కు చెందిన‌.. స్వ‌తంత్ర సంస్థ కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్‌.. ఏపీ ప్ర‌భుత్వానికి సంబంధించిన నివేదిక‌ను అంద‌జేసింది. గ‌త ఏడాది కాలంలో.. ఏపీ ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చులు.. వ‌చ్చిన ఆదాయాన్ని ఈ సంస్థ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల్లో సింహ‌భాగం .. ప్ర‌భుత్వం వేర్వేరు ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తోంద‌ని.. దీనివ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా మారుతోంద‌ని.. కాగ్ విమ‌ర్శించింది. ఇక‌, అప్పులు చేయ‌డంలోనూ.. అవ‌థులు దాటుతున్నార‌ని.. హెచ్చ‌రించింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దీనిని కార్న‌ర్ చేస్తూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శలు చేసింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచ‌కం సాగుతోంద‌ని.. తాము మొద‌టి నుంచి చెబుతున్నామ‌ని.. ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌ని.. చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం పెడుతున్న ఖ‌ర్చుల‌పై కూడా విమ‌ర్శ‌లు సంధించారు. ప‌థ‌కాల కింద చేస్తున్న ఖ‌ర్చులు.. దారిత‌ప్పుతున్నాయ‌ని అన్నారు.

వాస్త‌వానికి ఇలాంటి విమ‌ర్శ‌లు.. గ‌తంలో ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హించ‌ని వారు .. లేదా క‌మ్యూనిస్టులు వంటి అధికారానికి దూరంగా ఉన్న‌వారు.. అంటే ఎవ‌రైనా అర్ధం చేసుకుంటారు. కానీ, మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు.. వ్యాఖ్యానించ‌డం స‌రైందేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు కూడా కాగ్ నివేదిక‌లు ఇచ్చింది.

కాగ్ ఈరోజు పుట్టింది కాదు.. జ‌గ‌న్ కోస‌మే.. కాగ్ నివేదిక ఇచ్చింది కూడా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌తి ఏటా ఇచ్చేదే. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలోనూ.. ప‌థ‌కాల కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న నిధు ల‌ను దారిమ‌ళ్లిస్తున్నారంటూ.. కాగ్ నిప్పులు చెరిగింది. అంతేకాదు.. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం 1500 కోట్ల రూపాయ‌లు ఇస్తే.. కేవ‌లం 700 కోట్లు ఖ‌ర్చు పెట్టి.. మిగిలిన సొమ్మును ప‌థ‌కాల‌కు వినియోగించార‌ని కాగ్ చెప్పింది.

ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి నిదులు ఇవ్వ‌కుండా.. కేంద్రం రాజ‌ధాని విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. సో.. ఏదేమైనా.. కాగ్ పై చంద్ర‌బాబు వంటివారు అడ్డు పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం క‌న్నా.. కొన్ని సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వ‌డం మంచిద‌ని.. ప్ర‌జ‌లు సూచిస్తున్నారు.