Begin typing your search above and press return to search.
కీలక తీర్పును ఇచ్చిన ఏపీ హైకోర్టు.. కూతుళ్లకు అందులోనూ వాటా
By: Tupaki Desk | 23 March 2021 4:30 AM GMTప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టటమే కాదు.. అధికారికంగా జారీ చేసిన జీవోను రద్దు చేసి.. కీలక తీర్పును వెల్లడించింది. తాజా తీర్పు కారణంగా కుమార్తెలకు అదనపు హక్కు లభించనుందని చెప్పాలి. ఇంతకూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? అందులోని అంశాలేమిటి? అన్నది చూస్తే..
పింఛన్ పొందే అర్హతలను రాజ్యాంగ నిబంధనల ద్వారా కల్పించినప్పుడు జీవో జారీ చేసి అర్హతల్లో మార్పులు చేయటం సరికాదని ఏపీ హైకోర్టు పేర్కొంది. 1980 నాటి నిబంధనలు వితంతు.. విడాకులు పొందిన కుమార్తె పింఛన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు లేవని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవోను తీసుకొచ్చి వారి హక్కును నిరాకరించటానికి వీల్లేదని స్పష్టం చేసింది.
కుటుంబ పింఛన్ అన్నది వ్యక్తిగత ఆస్తిహక్కులో భాగమని.. దానిని నిలిపివేయటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఉల్లంఘించటమే అవుతుందని స్పష్టం చేసింది. విడాకులు.. వితంతువులుగా ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకోని 45 ఏళ్ల లోపు వారంతా అర్హులని.. ఆపైన వారంతా అర్హులు కారని పేర్కొన్నారు.
అయితే..ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన కోర్టు.. 45 ఏళ్లు దాటిన వారికే ఎక్కువ ఆరోగ్యయ సమస్యలు ఉంటాయని.. వయసు ఆధారంగా అర్హతల విషయంలో వివక్ష చూపటం సరికాదని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ.. విడాకులు.. వితంతువులైన మహిళలకు కుటుంబ పింఛన్ ను కొనసాగించాలని స్పష్టం చేసింది.