Begin typing your search above and press return to search.

పవన్ డ్రామాలు చేస్తున్నారంటూ ఏకబిగిన చెప్పిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   14 Feb 2022 5:49 AM GMT
పవన్ డ్రామాలు చేస్తున్నారంటూ ఏకబిగిన చెప్పిన ఏపీ మంత్రి
X
అనవసర రాజకీయాలు చేయకుండా.. విషయాల్ని ఎత్తి చూపిస్తూ.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి తన వాదనలు వినిపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబుకు పవన్ అండగా నిలుస్తున్నారని.. తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆయన గుర్తించటం లేదంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ మత్య్సకారులకు ఏమీ చేయలేదని.. అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం వారికెంతో చేసిందన్న ఆయన.. పవన్ తీరును తీవ్రంగా తప్పు పట్టటం గమనార్హం.

జగన్ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్న విషయం తెలిసినా.. జనసేన అధినేత డ్రామాలు ఆడుతున్నారంటూ ఏపీ మంత్రి మండిపడ్డారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన సందర్భంలో పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీదరి. జగన్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం నాలుగు ఫిష్పింగ్ హార్బర్లను నిర్మిస్తోందని.. పవన్ కల్యాణ్ వచ్చి చూస్తానంటే తాను చూపిస్తానని.. ఒకవేళ వాటిని చూడాలనుకుంటే జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి చూడొచ్చన్నారు.

మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్న ఆయన.. అందులో భాగంగా చేపల అమ్మకానికి రిటైల్ ఔట్ లెట్లు.. మార్కెటింగ్ అవకాశాలు కల్పించామన్నారు. గతంలో మత్స్యకారుల్ని ఉద్దేశించి తోలు తీస్తా.. ఫినిష్ చేస్తానంటూ చంద్రబాబు అన్న సమయంలో స్పందించని పవన్ ఈరోజు వారిపై అకస్మాత్తుగా ప్రేమ కనపర్చటం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

మత్య్సకారులకు పక్కా ఇళ్లు లేవని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వారికి 32 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని.. రాబోయే రోజుల్లో మత్స్యకారుడికి ఇల్లు లేదనే పరిస్థితే ఉండదన్నారు.

జనసేన తీరు చూస్తే.. టీడీపీని బలోపేతం చేయాలన్న తపన కనిపిస్తోందన్నారు. ఏప్రిల్ - మేల వస్తే మత్స్యకారులు వేట ఆపేయాలని.. ఆ సమయంలో బోటుకు రూ.4వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పేవారే కానీ ఇవ్వలేదని.. కానీ సీఎం జగన్ మాత్రం రూ.10వేలు చొప్పున ఇస్తున్నారని.. వారికి డీజిల్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు తెలుసా? అంటూ పవన్ ను ప్రశ్నించారు. మరి.. మంత్రి చేసిన వ్యాఖ్యలకు పవన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి