Begin typing your search above and press return to search.
ఆస్పత్రిలో కరోనా రోగి మాయం.. డ్రైనేజీలో శవం.. అనుమానాలు?
By: Tupaki Desk | 25 Aug 2020 5:31 PM GMTప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా రావడం.. ఆ వ్యక్తి మాయం కావడం.. డ్రైనేజ్ లో శవమై కనిపించడం కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది హత్య చేసి కిడ్నీలు లాక్కొని శవాన్ని ఇచ్చారని.. నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
యూపీలోని సుందర్ లాల్ బీహెచ్ యూ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఆ వ్యక్తి కనపడకుండా పోయాడని ఆస్పత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి.
పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదుచేయగా.. అందరూ గాలించారు. ఓ డ్రైనేజీలో ఆ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రి యాజమాన్యం కిడ్నీలు తీసి హత్య చేసి మృతదేహాన్ని తీసుకెళ్లి డ్రైనేజీలో విసిరేశారని.. నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఆ ఆస్పత్రిపై దాడి చేశాయి. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.