Begin typing your search above and press return to search.
మధ్యంతరం డిమాండ్ మానుకోదా ?
By: Tupaki Desk | 19 Nov 2021 12:30 AM GMTతెలుగుదేశం పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడో ఏ విషయంపై మాట్లాడినా వెంటనే వినిపించే డిమాండ్ ఏమిటంటే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని. దమ్ముంటే వైసీపీ ఎంఎల్ఏలందరు రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళదాం రమ్మంటు టీడీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు నుండి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఇదే చాలెంజ్ చేస్తున్నారు. నిజంగా ఈ డిమాండ్ వల్ల ఏం ఏపయోగమో ఎవరికీ అర్ధం కావటంలేదు.
151 సీట్ల అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది టీడీపీ నేతల చాలెంజ్ కు స్పందించి రాజీనామాలు చేయటానికా ? ఎవరైనా రెండున్నర సంవత్సరాల ముందు తమ ప్రభుత్వాన్ని రద్దుచేసుకుంటారా అనే చిన్న పాయింట్ కూడా చంద్రబాబు అండ్ కో లో లోపించటం ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు అండ్ కో రాజీనామాల డిమాండ్ చేయగానే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవటానికి జగన్ అండ్ కో అంత అమాయకంగా కనబడుతున్నారా ? జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజీనామా చేయండి, ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి మళ్ళీ ఎన్నికలకు వెళదామనే సవాలు తప్ప ఇంకో మాట మాట్లాడటం లేదు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అచ్చెన్న స్పందించారు. నిజంగానే ప్రజల మద్దతు తమకుందని జగన్ అనుకుంటే, అంత ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలంటూ చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. 13 మున్సిపల్ ఎన్నికల్లో 11 చోట్ల వైసీపీ గెలవటమంటే ప్రజలు మద్దతిచ్చినట్లే కదా. కంచుకోటగా పాపులరైన కుప్పంలో కూడా వైసీపీనే జనాలు గెలిపించటం వాస్తవం కాదా ?
ప్రభుత్వాన్ని రద్దు చేసుకోమని పదే పదే డిమాండ్ చేయటం వల్ల అధికారంలోకి రావాలని టీడీపీ ఆతృత జనాలకు అర్ధమైపోతోంది. పోనీ గతంలో ఎప్పుడైనా చంద్రబాబు ప్రతిపక్షాల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారా ? ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలతో రాజీనామా చేయించాలని జగన్ డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.
తాను అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల డిమాండ్లను పట్టించుకోని చంద్రబాబు తాను ప్రతిపక్షంలోకి రాగానే రాజీనామాల డిమాండ్ ను వందసార్లు వినిపించటమే విచిత్రం. పోనీ అచ్చెన్న చాలెంజ్ చేసినట్లుగానే మధ్యంతరం వచ్చి మళ్ళీ వైసీపీనే గెలిస్తే అప్పుడేం చేస్తారు ? చెప్పినట్లుగా టీడీపీని మూసేస్తారా ? టీడీపీని మూసేస్తామని చెప్పాల్సింది అచ్చెన్న కాదు చంద్రబాబు. కాబట్టి సొల్లు కబుర్లు చెప్పటం మానేసి పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై దృష్టిపెడితే బాగుంటుంది.