Begin typing your search above and press return to search.

ఆ విమాన‌ల‌పై నిషేధం కొన‌సాగుతుందిః డీజీసీఏ

By:  Tupaki Desk   |   30 Jun 2021 12:38 PM GMT
ఆ విమాన‌ల‌పై నిషేధం కొన‌సాగుతుందిః డీజీసీఏ
X
క‌రోనా మ‌హ‌మ్మారి ఎక్క‌డో చైనాలోని వుహాన్ లో పుట్టింది. అది అక్క‌డి నుంచి ప్ర‌పంచ దేశాల‌కు మోసుకెళ్లింది మాత్రం విమానాలే. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికులు ఆయా దేశాల‌కు వ‌చ్చి వెళ్లే క్ర‌మంలోనే వైర‌స్ అన్ని దేశాల‌కూ పాకింది. ప‌రిస్థితి తీవ్ర‌మైన త‌ర్వాత ప‌లు దేశాలు విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసుకున్నాయి. కానీ.. శాశ్వ‌తంగా ర‌ద్దు చేయడం అనేది ఈ ప్ర‌పంచీక‌ర‌ణ కాలంలో సాధ్యం కాదు. అందుకే.. ఆంక్ష‌ల న‌డుమ స‌ర్వీసులు న‌డిపిస్తున్నాయి ఆయా దేశాలు.

ఈ క్ర‌మంలో.. గ‌తేడాది మార్చిలో అంత‌ర్జాతీయ ప్యాసింజ‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ (గూడ్స్‌) విమానాల‌పై కేంద్రం నిషేధం విదించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కేసులు బీభ‌త్సంగా పెరిగిపోవ‌డం.. బ్రిట‌న్ వేరియంట్ వంటివి విజృంభించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కానీ.. అనివార్య ప‌రిస్థితుల్లో ఒప్పందాల‌తో స‌ర్వీసులు కొన‌సాగుతున్నాయి.

గ‌త జూలై నుంచి అగ్రిమెంట్‌ స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. అంటే.. ఎయిర్ బబుల్ వంటి విధానాల ద్వారా.. కరోనా సోకని ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇలాంటి ఒప్పందాలు 27 దేశాలతో చేసుకుంది భార‌త్‌. ఈ ప్ర‌కార‌మే.. విదేశీ ప్ర‌యాణికులు ఇండియాకు వ‌చ్చి వెళ్తున్నారు.

కాగా.. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న నిషేధాజ్ఞ‌లు, ఆంక్ష‌లను మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్టు జాయింట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) ప్ర‌క‌టించింది. ఈ పొడిగింపు ప్ర‌కారం జూలై 31 వ‌ర‌కు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. అయితే.. డీజీసీఏ ప్ర‌త్యేకంగా అనుమ‌తించిన అంత‌ర్జాతీయ కార్గో సేవ‌ల‌కు, ఇత‌ర సేవ‌ల‌కు ఈ ఆజ్ఞ‌లు వ‌ర్తించ‌వ‌ని తెలిపింది.