Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్..రేపే బీసీసీఐ నిర్ణయం

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:40 PM IST
ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్..రేపే బీసీసీఐ నిర్ణయం
X
ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా క్రికెటర్ , వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు చోటు కల్పించకపోవడంపై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ ను గాయం కారణంగా పక్కనపెట్టడం.. రోహిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో బయటపెట్టడంతో ఈ వ్యవహారం ముదిరింది.

తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకోబోతోంది. ఆదివారం రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు పంపించాలా? వద్దా అనే దాని తుదినిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.

దేశవ్యాప్తంగా రోహిత్ ను ఎంపిక చేయకపోవడంపై దుమారం రేగిన నేపథ్యంలో బీసీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. టీమిండియా ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ ఇచ్చిన రిపోర్ట్ కారణంగానే భారత సెలక్టర్లు రోహిత్ ఎంపిక చేయలేదని ప్రకటించింది.

ఆ క్రమంలోనే తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ గాయాన్ని ఆదివారం పరీశిలించనుందని తెలిపింది. గాయం తీవ్రతను బట్టి ఆసీస్‌కు పంపించాలా? వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. 'రోహిత్ శర్మ గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ ఆదివారం పరిశీలిస్తుంది. అతను ఆసీస్ పర్యటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నాడా? లేక మరికొద్ది రోజుల విశ్రాంతి అవసరమా? అనేదానిపై ఓ నిర్ణయానికి రానుంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను పరుగెత్తగలుగుతున్నాడా? అనేది పరీక్షంచనుంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో రోహిత్ భవితవ్యం ఈ ఆదివారం తేలబోతోందన్న మాట..