Begin typing your search above and press return to search.
అమెరికా గ్రాఫ్ పడిపోతోంది...
By: Tupaki Desk | 7 March 2017 10:13 AM GMTఒకప్పుడు ప్రపంచ ప్రజల కలల ప్రపంచంగా.. స్వర్గధామంగా.. కొలువుల తీరంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఆ స్థానం నుంచి పతనమవుతోంది. ట్రంప్ అధ్యక్షుడయ్యిన తరువాత జరుగుతున్న పరిణామాలతో అమెరికా ప్రపంచ ప్రజల ప్రయారిటీ లిస్టులో వెనక్కు వెళ్లిపోతోంది. అది ఇప్పుడు అంత అనుకూలంగా దేశం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ అండ్ గ్లోబల్ గ్రాండ్ కన్సల్టెంట్స్‌కు చెందిన యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల జాబితాలో అమెరికా ఏడో స్థానానికి పడిపోయింది. ఏడాది కిందట అమెరికా ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉండేది. కొద్ది నెలల్లోనే ఇది మూడు స్థానాలు కోల్పోయింది.
తాజాగా జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా రెండు - మూడో స్థానాల్లో కెనడా - బ్రిటన్ దేశాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో అమెరికా పట్ల ప్రతికూలతలు ఎక్కువవుతుండటం, 2016 చివర్లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై గౌరవం తగ్గిపోవడంతో అమెరికా ఏడో స్థానానికి పడిపోయింది. 2016లో ఈ జాబితాలో ఆమెరికా నాలుగోస్థానంలో ఉండేది. కానీ.. ఇమ్మిగ్రెంట్ల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు మొత్తం సీనును మార్చేశాయి.
కొత్త జాబితాలో జర్మనీ - జపాన్ - స్వీడన్ అమెరికాను కన్నా ముందుకు దూసుకెళ్లాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన అనంతరం ఈ సర్వే నిర్వహించి ఈ జాబితాను తాజాగా విడుదల చేశారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 21 వేల మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వే ద్వారా రాజకీయ మార్పులు ఒక దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/