Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో 2020లో అతిపెద్ద డీల్
By: Tupaki Desk | 20 Feb 2021 3:30 PM GMTకరోనా కల్లోలంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. పరిశ్రమలు బంద్ అయ్యాయి. అందరూ లాక్ డౌన్ తో ఇంట్లో ఉండి సంపాదన లేక నానా కష్టాలు పడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సత్తా చాటింది.
గత ఏడాది దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ హైదరాబాద్ లోనే జరిగింది. నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ పుష్ఫ ప్రాపర్టీస్ నార్సింగి ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 18 ఎకరాలను నేరుగా కొనుగోలు చేయగా.. మిగిలిన ఎకరాలను జాయింట్ డెవలప్ మెంట్ కింద దక్కించుకుంది. ఈ మేరకు ఈ డీల్ లో భాగస్వామ్యమైన సీబీఆర్ఈ ఇండియా తెలిపింది. కళ్లు చెదిరే రేటుకు ఇది అమ్ముడుపోయిందని పేర్కొంది. 2020లోనే ఇది అతిపెద్ద డీల్ అని తెలిపారు.
గత ఏడాది హైదరాబాద్ వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే త్రైమాసికంలో 50శాతం మేర వృద్ధి చెందుతాయని పేర్కొంది. ఎక్కువగా వాణిజ్యస్థలాలు, రెసిడెన్షియల్ టౌన్ షిప్ లను అభివృద్ధి చేస్తున్నారని సంస్థ తెలిపింది.
దేశవ్యాప్తంగా రియల్ రంగం దెబ్బతిన్నా హైదరాబాద్ లో మాత్రం కొనుగోళ్లు, డిమాండ్ పడిపోలేదని ఈ డీల్ చేస్తే అర్థమైంది. సంవత్సరకాలంగా తగ్గిపోయిన డిమాండ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుందని సంస్థలు తెలిపాయి.