Begin typing your search above and press return to search.

జగన్ చేసిన పని మీద నెట్టింట అతి పెద్ద డిబేట్!

By:  Tupaki Desk   |   21 Sep 2022 4:30 PM GMT
జగన్ చేసిన పని మీద నెట్టింట అతి పెద్ద డిబేట్!
X
జగన్ తాను అనుకున్నది చేస్తారని సొంత పార్టీ వారే చెబుతారు. ఆ సమయంలో ఆయన ఫలితాల గురించి కానీ పర్యవశానాలు గురించి కానీ అసలు ఆలోచించరు. ఏది ఎలా జరిగితే జరగనీ దానికి ప్రిపేర్ అవుదామనే అనుకుంటారని అంటారు. ఒక రకంగా ఆయనది దూకుడు రాజకీయం. దాని వల్ల ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. రెండింటినీ కూడా జగన్ తన రాజకీయ జీవితాన ఫలితాలుగా అందుకున్నారు.

ఇపుడు సీఎం హోదాలో అలాంటి నిర్ణయమే ఒకదాన్ని ఆయన తీసుకున్నారు. అదేంటి అంటే విజయవాడలో ఉన్న ఎంటీయార్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్శిటీ పేరుని దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ పేరిట మార్పు చేయడం. ఇది కూడా చకచకా చేసుకుని పోవడం. ఏ చర్చకు పెట్టని తీరున వైసీపీ సర్కార్ తీసుకున్న అర్ధరాత్రి డెసిషన్ గా మీడియాలో దీని మీద ప్రచారం కూడా సాగుతోంది.

ఇక దానిని సభలో బిల్లుగా తెచ్చి వెంటనే ఆమోదించేశారు కూడా. అయితే దీని మీదనే పెద్ద ఎత్తున ఏపీ లోపలా బయటా చర్చ సాగుతోంది. ఇక నెట్టింట అయితే అతి పెద్ద డిబేట్ గా ఈ ఇష్యూ మారింది. ఎన్టీయార్ తెలుగు సినీ వల్లభుడు. ఆయన రాజకీయంగా కూడా మేరు నగ ధీరుడు. అలాంటి మహానుభావుడి పేరుని తొలగించాలన్నది నిజంగా దుస్సాహసం.

ఎంటీయార్ హెల్త్ వర్శిటీని పెట్టింది తనకు ఏదో దాని మీద పేరు వస్తుందని కాదు. ఆనాటికి ఉన్న పరిస్థుతులను చూసి ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన చర్య. అలాంటి ఎన్టీయార్ పేరుని తొలగించడం పట్ల పార్టీలకు అతీతంగా అంతా స్పందిస్తున్నారు. ఇక సినీ వర్గాల్లో కూడా దీని మీద చర్చ సాగుతోంది. కొంతమంది సినీ ప్రముఖులు అయితే ఎన్టీయార్ పేరు మార్చడం పట్ల మరోమారు ఆలోచన చేయాలని జగన్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే నెట్టింట కూడా ఇలాంటి రిక్వెస్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జరిగిందేదో జరిగింది. జగన్ మళ్లీ మనసు మార్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంతా కోరుతున్నారు. వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి చేసిన సేవలను కూడా ఎవరూ తక్కువ చేయడంలేదు. కానీ ఆయన పేరు తెచ్చి ఇలా పెట్టడం వల్ల ఇద్దరు మహానుభావులకూ అది ఇబ్బందికరమే అని అంటున్నారు. మొత్తానికి జగన్ డెసిషన్ మీద నెట్టింట భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వెనక్కి డెసిషన్ తీసుకోమని అంటున్నారు. మరి జగన్ తగ్గుతారా. ఏమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.