Begin typing your search above and press return to search.

అతి పెద్ద నంబర్... బాబు ఓకే... అందుకే పవన్ రెడీ...?

By:  Tupaki Desk   |   19 Oct 2022 12:30 PM GMT
అతి పెద్ద నంబర్... బాబు ఓకే... అందుకే పవన్ రెడీ...?
X
ఏపీలో కొత్త పొత్తులకు బాటలు పడుతున్నాయి. ఇంతకాలం ఆలోచనల దశలో ఉన్న పొత్తులు ఇపుడు అడుగుల దాకా వచ్చాయి. నూటికి నూరు శాతం ఏపీలో జనసేన టీడీపీ పొత్తు కుదరడం ఖాయమనే అంటున్నారు. అయితే ఈ పొత్తుల వెనక చాలా విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. గతంలో ఆరు శాతం ఓట్లతో సరిపుచ్చుకున్న జనసేన ఇప్పటికి అయితే పదమూడు శాతం ఓట్ల షేర్ ని రాబట్టే పరిస్థితి ఉంది అని సర్వే నివేదికలు చెబుతున్నాయి.

ముఖ్యంగా విశాఖ, గోదావరి జిల్లాలలో జనసేన బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఈసారి చేస్తుంది అని కూడా లెక్కలు తేల్చుతున్నాయి. ఒక విధంగా చూస్తే నలభై నుంచి యాభై సీట్లలో ఏపీలో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుంది అని అంటున్నారు. అలాంటి జనసేనను కలుపుకుంటే టీడీపీకి మేలు జరుగుతుంది, లేకపోతే ఆ మేరకు జనసేన తాను గెలవకపోయినా టీడీపీ ఓటమికి కారణం అవుతుంది.

అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా చంద్రబాబు నేరుగా తానుగా పవన్ బస చేసిన హొటల్ కి వచ్చారని అంటున్నారు. ఆ హొటల్ లో దాదాపుగా గంట పాటు సుదీర్ఘమైన మంతనాలు జరిగాయని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబు వన్ టూ వన్ భేటీ నిర్వహించారని అంటున్నారు.

ఈ చర్చల అనంతరం ఇద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే జనసేన పార్టీకి నలభై దాకా సీట్లను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది అని.

ఆ నంబర్ కంటే తగ్గేది లే అన్నట్లుగా జనసేన పట్టిన పట్టుకు టీడీపీ వైపు నుంచి ఓకే అయింది కాబట్టే బాబు నేరుగా జనసేనాని దగ్గరకు వచ్చారని అంటున్నారు. మరో వైపు చూస్తే మొత్తం 175 సీట్లలో నలభై టీడీపీకి ఇస్తే మిత్రులకు మరో పది సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా 55 సీట్లు పోతే టీడీపీ 120 సీట్లకే పరిమితం అవుతుంది.

మరి ఈ ప్రతిపాదన వల్ల తమ్ముళ్లకు అవకాశాలు తగ్గినా రేపటి రోజున ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది కాబట్టే అంగీకరించే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తులో నలభై సీట్లు కనుక పవన్ తీసుకుంటే అందులో కనీసం ముప్పయి సీట్లు గెలుచుకున్నా ఏపీలో అత్యంత నిర్ణయాత్మక శక్తిగా జనసేన నిలుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి జనసేన పక్కా వ్యూహాలతోనే టీడీపీతో చేతులు కలుపుతోంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.