Begin typing your search above and press return to search.

ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య

By:  Tupaki Desk   |   30 Nov 2021 1:30 PM GMT
ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య
X
ప్రపంచంలో చాలామందిని పట్టిపీడిస్తున్న వాటిలో ప్రధానమైనది ఊబకాయం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిని వేధిస్తోంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సరైనటువంటి ఆహారపు అలవాట్లు లేకపోతే ఎక్కువమంది ఈ జబ్బు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఊబకాయం వచ్చిందంటే మనుషులు తగ్గడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో కీలక విషయాలు ఈ సమస్యకు సంబంధించి వెల్లడయ్యాయి.

ప్రత్యేకంగా ఐదు సంవత్సరాల లోపు ఉండే బాలబాలికల్లో ఊబకాయం శాతం పెరిగిందని ఈ సర్వే స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆడ, మగ అనే భేదం లేకుండా చాలామంది ఊబకాయం బారిన పడినట్లు వెల్లడైంది. గతంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఈసారి ఊబకాయం వచ్చిన వారి శాతం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో ప్రధానంగా వెలుగుచూసిన అంశం ఏమిటంటే ఐదేళ్లలోపు ఉన్న వారిలో ఊబకాయం ఎక్కువగా పెరిగింది గతంలో చేపట్టిన సర్వేతో పోలిస్తే నేటికీ 1.3 శాతం ఎక్కువ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వే ప్రకారం చిన్నరుల్లో ఎక్కువ భాగం ఊబకాయం ఉన్నది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్ దిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కశ్మీర్. వీటిలో ఉండే చిన్నారులు ఎక్కువ మంది ఊబకాయం బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో దక్షిణ భారతదేశం నుంచే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం చిన్నపిల్లలలో ఊబకాయం ఉన్న వారు చాలా తక్కువ అని వెల్లడైంది.

ఇదిలా ఉంటే ఊబకాయం కేవలం చిన్న పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదు. స్త్రీ, పురుషుల్లోనూ ఈ సమస్య అధికమైన ఈ సర్వేలో తేలింది. గత సర్వేతో పోలిస్తే స్త్రీలలో నాలుగు శాతం మేర ఊబకాయులు పెరిగితే పురుషుల్లో మాత్రం మూడు శాతానికి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఊబకాయం బారిన పడడానికి తగినంత శారీరక శ్రమ అనేది లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం అనేది క్రమంతప్పకుండా చేస్తే దీని నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. దీనికి తోడు మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు రావాలని సూచించారు. జంక్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలని అని చెప్తున్నారు ఇలా కొన్ని నియమాలను పాటించడం వల్ల ఊబకాయానికి దూరంగా ఉండొచ్చని అంటున్నారు. గతంతో పోల్చుకుంటే మారిన అలవాట్లు ఆహార పద్ధతులు కూడా మరో కారణమైనట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల్లో ఆదాయం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు కూడా మారినట్లు గుర్తించారు ఇది కూడా ఊబకాయానికి ఓ కారణంగా చెబుతున్నారు.