Begin typing your search above and press return to search.
ఆందోళన అక్కర్లేదు.. ఫోన్ పే పని చేస్తుందట
By: Tupaki Desk | 9 March 2020 5:27 AM GMTడిజిటల్ పేమెంట్ల హడావుడి పెరిగిన వేళ.. అందుకు తగ్గట్లే.. పేటీఎం.. ఫోన్ పే.. గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపుల ఫ్లాట్ ఫాంల జోరు పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకు పుణ్యమా అని.. ఫోన్ పే చిక్కుల్లో పడింది. ఆర్ బీఐ విధించిన మారిటోరియం నేపథ్యంలో ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చన్న మాటతో.. ఫోన్ పే సేవలు నిలిచిపోయాయి.
దీంతో.. ఈ యాప్ ను నమ్ముకున్న కోట్లాది మందికి కొత్త కష్టం మొదలైంది. ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతూ.. పేటీఎంకు పోటీగా మారుతున్న ఫోన్ పే ఇమేజ్ కు భారీ నష్టం వాటిల్లిన పరిస్థితి. తనకు ఎదురైన ఇబ్బందిని అధిగమించేందుకు ఫోన్ పే యుద్ధప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
తాజాగా ఈ సంస్థ ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫోన్ పేకు యస్ బ్యాంక్ స్థానంలో ఐసీఐసీఐ సేవలు అందించనుంది. సరైన సమయంలో ఐసీఐసీఐ ముందుకు వచ్చి నగదు సర్దుబాటు చేయటంతో భారీ కష్టం నుంచి ఫోన్ పే బయటపడనున్నట్లు చెబుతున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభంతో ఫోన్ పే మాదిరి డిజిటల్ పేమెంట్స్ సర్వీసులు అందించే 15 సంస్థలు కష్టాల్లో పడ్డాయని.. అవి కూడా త్వరలో పని చేస్తాయంటున్నారు. మొత్తంగా రెండు రోజుల నుంచి టెన్షన్ పడుతున్న ఫోన్ పే వినియోగదారులకు ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.