Begin typing your search above and press return to search.
ఆ ఊళ్లోకి వెళ్ళగానే పక్షులు సూసైడ్ చేసుకుంటాయి..!
By: Tupaki Desk | 1 Jun 2022 2:30 AM GMTవింతలు, విశేషాలకు కొదువలేని దేశం భారత్. ప్రతిరోజు ఎక్కడో చోటా ఏదో ఒక వింత ఘటన జరుగుతూనే ఉంటుంది. ఇక వింత వింత ప్రాంతాలు.. విశిష్ట ప్రదేశాలు కూడా ఇండియా సొంతం. అలాంటి ఓ వింత ప్రదేశం అసోం రాష్ట్రంలో ఉంది. మరి ఆ ప్రాంతం స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య.. ప్రియుడి మోసం చేశాడని బలవన్మరణం.. అమ్మ తిట్టిందని.. నాన్న కొట్టాడని.. పరీక్షలో ఫెయిల్ అయ్యానని.. ఇలా రకరకాల కారణలాతో సూసైడ్ చేసుకోవడం గురించి ప్రతిరోజు మనం వింటుంటాం. మనుషులకు తీరని బాధ కలిగినప్పుడు.. తీవ్ర మనస్తాపానికి గురై.. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
కానీ పక్షలు కూడా ఇలా బలన్మరణాలకు పాల్పడతాయంట. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అసోంలోని బోరెల్ కొండల మధ్య జాతింగా అనే గిరిజన గ్రామంలోకి వెళ్లగానే పక్షలు ఆత్మహత్య చేసుకుంటాయట. అందుకే జాతింగా గ్రామాన్ని సూసైడ్ పాయింట్ ఆఫ్ బర్డ్స్ అని పిలుస్తారట.
ఏదో ఒకటో రెండు పక్షలు చనిపోతే సాధారణ మరణాలు అనుకుంటాం. కానీ ఈ ప్రాంతంలోకి రాగానే భారీ సంఖ్యలో పక్షులు ప్రాణాలు తీసుకుంటున్నాయంట. భారతదేశ పక్షులే కాదు.. సీజన్ బట్టి వలస వచ్చే విదేశీ పక్షులు పొరపాటు ఈ గ్రామంలోకి వెళ్తే అవి కూడా సూసైడ్ చేసుకుంటున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం జాతింగా గ్రామానికి రాగానే పక్షులు ఎక్కువ వేగంతో ఎగురుతాయి.. వేగంగా వెళ్తూ ఎదురుగా ఏం ఉన్నాయో చూడకుండా.. భవనాలు, చెట్లను ఢీకొంటాయి. ఇక అంతే గట్టిగా ఢీకొట్టడంతో వెంటనే గాయపడి కిందపడిపోతాయి. ఇక ఎగరలేక విలవిలలాడి ప్రాణాలు కోల్పోతాయి.
సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య పక్షుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అది కూడా రాత్రి సమయంలో చోటుచేసుకుంటున్నాయని వెల్లడించాయి. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఇక్కడ పక్షులు తమ ప్రాణాలను తీసుకుంటాయని.. మిగిలిన సమయంలో మాత్రం బాగానే ఎగురుతూ కనిపిస్తాయని సర్వేలో వెల్లడైంది. దాదాపు 40 జాతుల స్థానిక, వలస పక్షులు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నాయని పేర్కొంది.
కొన్ని ప్రాకృతిక కారణాల వల్ల జాతింగా గ్రామానికి ఇతర ప్రాంతాలతో తొమ్మిది నెలలుగా సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామం లోకి రాత్రిపూట ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ పక్షుల ఆత్మహత్యకు గల కారణాలపై ఓ క్లారిటీ రాలేదు. ఇక్కడ అయస్కాంత శక్తి ఎక్కువని.. పొగమంచు ఎక్కువగా పడటం.. గాలులు వేగంగా వీయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొందరు భావిస్తున్నారు. చీకటిగా ఉండటం వల్ల కనిపించక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కానీ జాతింగా గ్రామస్థులు మాత్రం.. తమ గ్రామంలో ఏదో దుష్టశక్తి ఉందని.. ఇదే ఇక్కడి పక్షులను బతకనివ్వడం లేదని నమ్ముతున్నారు.