Begin typing your search above and press return to search.
బీజేపీకి ఊడిగం చేయలేం... కమలానికి పవన్ తలాఖ్
By: Tupaki Desk | 18 Oct 2022 11:32 AM GMTఏపీలో రాజకీయం పూర్తి స్పష్టతకు వస్తోంది. ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు అయ్యే సీన్ కనిపిస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు మొత్తానికి మొత్తం చీల్చకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అదిపుడు కార్యరూపం దాలుస్తూ వస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన జట్టుగా ఉన్నాయి. అయితే ఈ బంధం పూర్తిగా కొనసాగుతుందా వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ కలసి పోటీ చేస్తారా అన్న చర్చలు సాగుతూ వచ్చేవి.
దానికి ఇపుడు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా చాలా వరకూ స్పష్టత ఇచ్చేశారు. ఏపీలో జనసేనకు బీజేపీ రోడ్ మ్యాప్ అడిగినా ఇవ్వలేదని ఆయన అంటున్నారు. అంతే కాదు రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కడో సరిగ్గా లేదన్న భావన కనిపిస్తోంది అని కూడా అన్నారు. ఏపీ ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను మార్చుకుంటామని పవన్ చెప్పడం కీలకమైన పాయింట్.
అంటే ఏపీలో బీజేపీకి తెగదెంపులు ఇచ్చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంకో వైపు పవన్ చెప్పిన మాట ఏంటి అంటే తనకు పదవీ వ్యామోయంలేదని, అంటే ఏపీలో టీడీపీతో పొత్తుకు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అన్న సందేహాలు వచ్చేలా ఈ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
మరో వైపు ప్రధాని మోడీ అన్నా బీజేపీ అన్నా తనకు గౌరవమే అని అలాగని ఊడిగం చేయమంటే చేయలేమని పవన్ తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏపీలో బీజేపీతో పొత్తునకు పవన్ తలాఖ్ చెప్పేస్తున్నారు అని.
సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబుతో ఆయన భేటీ కావడం కూడా ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పనున్నాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీని పక్కన పెట్టేసి కాంగ్రెస్, వామపక్షాలు జనసేన టీడీపీ అంతా కలసి మహా కూటమిగా ముందుకు వస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.