Begin typing your search above and press return to search.
వరాల జల్లు కురిపిస్తున్న మోడి - షా!
By: Tupaki Desk | 24 Jan 2021 5:30 PM GMTతొందరలోనే ఎన్నికలు జరగనున్న అస్సాంలో జనాలపై బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. శని, ఆదివారాలు అస్సోంలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు జనాలను ఊరించేట్లుగా పథకాలు ప్రకటించారు. మోడి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. 1.06 లక్షల మందికి మోడి ఇళ్ళ పట్టాల పంపిణీ చేశారు. అలాగే ఆదివారం పర్యటించిన అమిత్ బోడో ల్యాండ్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
మొత్తానికి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వరాలజల్లు కురింపించేందుకు కేంద్రప్రభుత్వం తరపున బీజేపీ అగ్రనేతలు రెడీ అయిపోయిన విషయం అర్ధమైపోయింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా అస్సాంకు చేరుకున్న అమిత్ బోడో ఉద్యమానికి కేంద్రస్ధానంగా ఉన్న కోక్రాఝుర్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. మోడి ఆధ్వర్యంలోనే అస్సాంలో ఉగ్రవాదం, అవినీతి అంతమవుతాయన్నారు.
అస్సాంలో బోడో తీవ్రవాదులతో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద గ్రూపులతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఒప్పందాలు చేసుకున్నా ఉపయోగం లేకపోయిందన్నారు. అయితే తమ హయాంలో ఒప్పందాలు జరిగిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతత ఏర్పడిన విషయాన్ని అమిత్ గుర్తుచేశారు. తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే మంచి మెజారిటితో గెలుస్తుందన్న ఆశాభావాన్ని షా వ్యక్తంచేశారు.