Begin typing your search above and press return to search.
ఇలాంటి గెలుపులే.. అమిత్ షా గొప్పదనమా?
By: Tupaki Desk | 21 March 2020 2:30 AM GMTవాళ్ల ప్రభుత్వాన్ని కూల్చి.. వీళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. అదేమంటే ఇది అమిత్ షా వ్యూహం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇలా ప్రభుత్వాలను కూల్చడంలో ఆరితేరిపోతూ ఉన్నట్టుగా ఉంది. ప్రజలు తమను తిరస్కరించిన వివిధ రాష్ట్రల్లో కమలం పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంటూ ఉంది. ప్రత్యర్థి పార్టీల్లో ఎమ్మెల్యేల చేత తిరుగుబాట్లు చేయింది రాజకీయ లబ్ధి పొందుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. కొన్ని చోట్ల ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు చీదరించుకుంటూ ఉన్నారు. అయినా బీజేపీ మాత్రం ఇదో గొప్ప వ్యూహం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం అమిత్ షా చాణక్యం అంటూ మీడియా వర్గాలు ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం. వాస్తవానికి మధ్యప్రదేశ్ లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు. కేంద్రంలో బీజేపీ సర్కారుకే ఓటేసిన మధ్యప్రదేశ్ ప్రజలు ఆ రాష్ట్రానికి మాత్రం బీజేపీ అవసరం లేదన్నట్టుగా తీర్పును ఇచ్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం కమలం ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.
ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే.. అక్కడ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. తమకు మెజారిటీ ఉందో లేదో ప్రజల ద్వారా చెక్ చేసుకోవాలి. అయితే బీజేపీకి అంత సీన్ కనిపించడం లేదు. ప్రజల తీర్పుతో
సంబంధం లేకుండా.. ఎమ్మెల్యేల తిరుగుబాట్లతో కమలం పార్టీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి ఇలాంటివి అసాధ్యమైన ఫీట్లు ఏమీ కాదు.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు.. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పనులు చేసింది. ఆ తర్వాత ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే. బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని కలిగి ఉంది కాబట్టి.. ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంది. వాటికి చాణక్యవ్యూహాలు, చక్రవ్యూహాలు అంటూ పేర్లు పెడుతూ ఉన్నారు. కేంద్రంలో అధికారం ఉంటే.. ఎవరైనా ఇలాంటి ప్రభుత్వాలను కూల్చే పనులు చేయగలరు. ప్రజలు ఏ మాత్రం ఇష్ట డని పనులు ఇవి అనే విషయాన్ని కూడా బీజేపీ వాళ్లు ఇలాంటి సందర్భంలో గుర్తుంచుకోవాలేమో!