Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బీజేపీదే అధికారం.. కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. శ‌కుని అంటూ.. సీనియ‌ర్ల కౌంట‌ర్

By:  Tupaki Desk   |   14 Jan 2023 4:30 PM GMT
మ‌ళ్లీ బీజేపీదే అధికారం.. కాంగ్రెస్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. శ‌కుని అంటూ.. సీనియ‌ర్ల కౌంట‌ర్
X
కాంగ్రెస్‌లో ఉంటూ.. పొరుగు పార్టీల‌నుప్రెయిజ్ చేయ‌డం కొంద‌రికి అలవాటుగా మారిపోయింది. అదేమం టే అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇలాంటివారిని ఇప్పుడు 'శ‌కుని' అంటూ సీనియ‌ర్లు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌శిథ‌రూర్‌ను 'శ‌కుని' అంటూ..సీనియ‌ర్లు కామెంట్లుచేస్తున్నారు. ఆయ‌న‌ను పార్టీ నుంచి గెంటేయాల‌ని కొంద‌రు సూచిస్తున్నారు.

గతంలో పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన శ‌శి థ‌రూర్‌.. పెద్ద ఎత్తున కామెంట్లుచేశారు. అయితే.. చివ‌ర‌కు మ‌ల్లికార్జున ఖ‌ర్గే విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా కొంత వ‌ర‌కు త‌గ్గారు. కానీ, ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీనే విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఓ 50 సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ని.. అంత‌కు మించిన బ్రహ్మాండం ఏమీ జ‌ర‌గ‌ద‌ని వ్యాఖ్యానించారు.

అయితే.. 2019లో సాధించిన ఏక‌ప‌క్ష‌ విజయాన్ని బీజేపీ పునరావృతం చేయడం అసాధ్యమేనని వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే 50 సీట్లను కోల్పోవచ్చని అంచనా వేశారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

'2019లో బీజేపీ సాధించిన ఏక‌ప‌క్ష విజయం.. 2024లో పునరావృతం కాకపోవచ్చు. అలాగే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ మార్కుకంటే దిగువకు పడిపోవడం కూడా అసాధ్యమేమీ కాదు' అని థరూర్ వ్యాఖ్యానించారు. అలాగే పుల్వామా, బాలాకోట్ దాడులు చివరి నిమిషంలో ప్రభావం చూపాయని, రానున్న ఎన్నికల్లో ఇలాంటివి రిపీట్ కావని వెల్లడించారు.

బీజేపీ 50 సీట్లు కోల్పోవడమనేది ఊహించదగిందేన్నారు. అది ప్రతిపక్షాలకు లాభదాయకంగా మారినా.. అవి అధికారం అందుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పారు. ఎందుకంటే.. విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా..? అనేది సందేహ‌మేన‌ని అందుకే బీజేపీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని అన్నారు. అయితే.. సీనియ‌ర్లు ఈ వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డారు. ఒక‌వైపు.. కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌తో పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. ఇలాంటి శ‌కునులు ఇలా అంటున్నార‌ని.. వీళ్ల‌ని గెంటేయాల‌ని సీనియర్లు మండిప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.