Begin typing your search above and press return to search.

ఇందులో బీజేపీనే టాప్

By:  Tupaki Desk   |   10 Feb 2022 9:30 AM GMT
ఇందులో బీజేపీనే టాప్
X
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటంలో బీజేపీనే టాప్ అని చెప్పాలి. అదేంటి అన్నీ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి అందరికన్నా ముందే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రంగంలోకి దిగేశారు కదాని అనుకుంటున్నారు. మీరు అనుకున్నది నిజమే కానీ డిజిటల్ మీడియా ప్రచారంలో మాత్రం కమలం పార్టీయే టాప్.

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ రోడ్డులో షోలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే.

అందుకనే బీజేపీ ముందుగానే డిజిటల్ ప్రచారంలోకి దిగేసింది. 2014, 19 లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైతే డిజిటల్ ప్రచారానికి తెరలేపిందో ఇపుడు కూడా అదే పద్దతిని అనుసరిస్తోంది. డిజిటల్ మీడియా ప్రచారాన్ని పర్యవేక్షించటానికే రాష్ట్రం మొత్తంలో 10 వేల మంది నిపుణులను నియమించుకున్నది.

2 లక్షల వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. అలాగే ఫేస్ బుక్ ట్విట్టర్లో కూడా కొన్ని వేల ఖాతాలను ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా 1.74 లక్షల పోలింగ్ బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటిలో 10 మంది ఉంటారు. వీరిలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకర్షించేందుకు, బీజేపీకి మద్దతుగా మార్గదర్శనం చేసేందుకే నియమించుకున్నది.

బీజేపీ సభ్యత్వం తీసుకున్న 4 కోట్లమంది స్మార్ట్ ఫోన్లనో పార్టీ ప్రచారం కోసమే 24 గంటలూ కష్టపడుతున్నారట. అంటే వీళ్ళ పనేమిటంటే నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ను బ్రహ్మాండంగా ప్రొజెక్టు చేయటం. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో బీజేపీనే ఉంటే జనాలకు జరిగే మేలును పదే పదే చెప్పటం. అసెంబ్లీ అభ్యర్ధులపై పాజిటివ్ గా ప్రచారం చేయటంతో పాటు ప్రత్యర్ధుల మైనస్ పాయింట్లను హైలైట్ చేస్తుండటమే వీళ్ళ పని. ఇక కాంగ్రెస్ విషయం తీసుకుంటే ఈ పార్టీ కూడా 1.5 లక్షల వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసింది. 2 లక్షల మంది డిజిటల్ ప్రచారం చేస్తున్నారు. అసలు పోటీలో ఉందో లేదో కూడా తెలీని కాంగ్రెస్ పార్టీ ఈ స్ధాయిలో ప్రచారం చేసుకుంటోందంటే గ్రేటనే అనుకోవాలి. కారణాలు తెలీవు కానీ ఎస్పీ, బీఎస్పీలు డిజిటల్ ప్రచారంలో బాగా వెనకబడిపోయాయి.