Begin typing your search above and press return to search.
పనిమనిషికి నరకం చూపించిన బీజేపీ నాయకురాలు.. తర్వాత జైలుకు!
By: Tupaki Desk | 31 Aug 2022 9:30 AM GMTసహజంగా ఇంట్లో పనులు చేసేవారు.. ఒక్కొక్కసారి.. చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఇంట్లో ఉండేవారికి నచ్చినట్టుగా.. చేయాలనిఉన్నప్పటికీ.. కొన్ని సార్లు తడబడుతుంటారు. అయితే.. అలాంటి సమయంలో మరోసారి చెప్పి చేయించుకోవడం అనేది.. ఇంటి ఇల్లాళ్లకు సహజమే! అయితే.. బీజేపీ నాయకురాలు.. మాత్రం ఈ చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూస్తూ.. పనిమనిషిని చితక్కొట్టేసింది. కారణం చిన్నదే అయినా.. భారీ ఎత్తున విరుచుకుపడింది. చివరకు ఈ నాయకురాలు.. జైలు పాలైంది. పార్టీ కూడా సస్పెండ్ చేసేసింది.
ఏం జరిగిందంటే.. ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు సీమా పాత్రా ఇంట్లో పనిచేసే 29 ఏళ్ల సునీత.. రెండు గిన్నెలను సరిగా తోమలేదు. ఒక గిన్నె జిడ్డు కారుతోంది. దీనిని గమనించిన సీమా పాత్ర.. సునీతపై విరుచుకుపడింది. చేతికి ఏదిదొరికితే దాంతో చితక్కొట్టేసింది.
దీంతో సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీమా పాత్రా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియోలో వాపోయింది.
ఈ వేధింపులు నిత్యకృత్యంగా మారాయని.. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది. 29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్‌నగర్ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. తొలి రోజుల్లో బాగానే ఉన్నా.. తర్వాత తర్వాత.. సీమా పాత్ర తన ప్రతాపం చూపించడం ప్రారంభించారు. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేసేవారట. దీంతో స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో పోలీసులు ఆమెను రక్షించారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి సీమా పాత్ర పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. రోడ్డు మార్గంలో రాంచీ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. బుధవారం.. ఆమెను కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమా పాత్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. సీమా పాత్రా బీజేపీ మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్ పాత్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పనిమనిషి వీడియో వైరల్‌గా మారిన తర్వాత సీమాను బీజేపీ సస్పెండ్ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.