Begin typing your search above and press return to search.
సిటీ లో పాఠశాలలకు బాంబు బెదిరింపుల 'మెయిల్'
By: Tupaki Desk | 8 April 2022 10:36 AM GMTకర్ణాటకను ఒకదాని వెంట ఒకటి వివాదాలు వెంటాడుతున్నాయి. మార్చి నెలలో హిజాబ్ వివాదం ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం కోర్టుల వరకు వెళ్లింది. మిగతా రాష్ట్రాల్లోనూ హిజాబ్ ప్రకంపనలు కనిపించాయి. అది సద్దుమణిగింది అనుకుంటే రంజాన్ నెల ప్రారంభ సమయానికి అజాన్ వివాదం వచ్చింది. మసీదుల్లో ప్రార్థనలకు ముందు వచ్చే పిలుపు అజాన్ ను నిషేధించాలన్న హిందూ సంఘాల డిమాండ్ రచ్చకెక్కింది. లౌడ్ స్పీకర్లను నియంత్రించకపోతే.. ఆలయాల్లో హనుమాన్ చాలీసా ను గట్టిగా చదువుతామని శ్రీరామ్ సేన ప్రకటించింది. ఈ నెల 13ను డెడ్ లైన్ గా పేర్కొంది.
రాజకీయ లబ్ధికే అంటూ విమర్శలు దక్షిణాదిన తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కర్ణాటక. గత 15 ఏళ్లలో అక్కడ పలుసార్లు విజయం సాధించింది. ప్రస్తుతం ఆ పార్టీనే అధికారంలో ఉంది. గతేడాది యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మైను సీఎంను చేసింది. అయితే, తాజా వివాదాల వెనుక రాజకీయ లబ్ధి ఉందనే అనుమానాలు, విమర్శలు వచ్చాయి.
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని.. కర్ణాటక రాజకీయాలపై తొలి నుంచి యడియూరప్పకు పట్టు ఉందని.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తెరపైకి హిందూత్వను తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ప్రశాంత కర్ణాటకలో తాజా వివాదాలు ప్రగతిపై ప్రభావం చూపుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు ఇటీవల బెంగళూరుకు దీటుగా హైదరాబాద్ ఎదుగుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఐటీ, బీటీ, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. దీనిపై కర్ణాటక, తెలంగాణ మధ్య సవాళ్లు కూడా నడిచాయి.
బెంగళూరులో బాంబు బెదిరింపుల కలకలం తాజాగా బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా స్కూళ్లకు వెళ్లి విస్తృత తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఏడు ప్రముఖ పాఠశాలలకు వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల నుంచి ఓ మెయిల్ వచ్చింది. "మీ స్కూల్‌లో శక్తిమంతమైన బాంబు పెట్టాం. ఇది జోక్ కాదు.
ఆ బాంబు పేలితే చాలా మంది మరణిస్తారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది" అని ఆ మెయిల్‌లో రాసి ఉంది. ఆ సమయంలో ఆయా స్కూళ్లలో పరీక్షలు జరుగతున్నాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి.
దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్‌తో పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులను బయటకు పంపించి కార్డన్‌సెర్చ్ చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని బెంగళూరు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఇవి నకిలీ బెదిరింపులు అయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నాయి. అయితే తనిఖీలు కొనసాగుతున్నాయని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పంత్ వెల్లడించారు.