Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ కు గడగడలాడించిన కుర్రాడు...ఏం చేశాడంటే..?

By:  Tupaki Desk   |   31 Jan 2022 7:41 AM GMT
ఎలన్ మస్క్ కు గడగడలాడించిన కుర్రాడు...ఏం చేశాడంటే..?
X
ప్రపంచ కుభేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ యంగ్ డైనమిక్ అత్యంత ధనవంతుడిగా పేరు పొందాడు. ప్రపంచంలో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న ఈయనను ఓ కుర్రాడు భయపెట్టాడు. చిన్నపాటి మెసేజ్లు పెడుతూ ఎలన్ మస్క్ గుండెల్లో దడ పుట్టించాడు. ఎలన్ మస్క్ ను మాత్రమే కాకుండా కొందరు ప్రముఖులను సైతం ఆ యువకుడు గడగడలాడించాడు.

అయితే తాను రూపొందించిన ఓ టెక్నాలజీతో ఈ పనిని డబ్బు కోసం చేసినట్లు తెలుస్తోంది. తాను అడిగినంత డబ్బు ఇచ్చేందుకు ఎలన్ మస్క్ అంగీకరించాడని ఆ యువకుడు సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఆ మొత్తాన్ని యువకుడు అందుకున్నాడా..? లేదా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రపంచ కుభేరుడిని భయపెట్టిన ఆ యువకుడి గురించి నెట్టింట్లో జోరుగా చర్చ సాగుతోంది.

జాక్ స్వీనీ.. ఈ కుర్రాడికి పట్టుమని 19 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఓ కంపెనీ అధినేతను వణికించాడు. అత్యంత హై టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖులను గడగడలాడించాడు. తాను రూపొందించిన టెక్నాలజీతో విమాన కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ప్రముఖులు ఎప్పుడు.. ఎక్కడికి విమానాల్లో ప్రయాణిస్తున్నారో తనకు ఇట్టే తెలిసిపోతుంది. కొందరు ప్రముఖులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడు. దీంతో కొందరు ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూడా ట్రాక్ చేశాడు. అలాగే జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల విమానాల జర్నీ ట్రాక్ ను కూడా తెలుసుకున్నాడు. అయితే వీరంతా ఆ యువకుడిని ఆ పని చేయొద్దని కోరారు. ఇలా విమానాలు ట్రాక్ చేయడం వల్ల ఎంత నష్టమో తెలిపారు. అంతేకాకుండా ఇలా ట్రాక్ చేయకుండా ఉండడానికి ఎలన్ మస్క్ 5,000 డాలర్లు ( 3.75 లక్షలు) ఇస్తానని ఆఫర్ చేశాడు. అయితే అందుకు ఆ యువకుడు నిరాకరించాడు. తనకు 50 వేల డాలర్లు(37.55 లక్షలు) కావాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బుతో టెస్లా కంపెనీ కారు కొనుక్కుంటానని తెలిపాడు. అలాగే స్కూల్ ఫీజు కూడా చెల్లిస్తానని పేర్కొన్నాడు.

జాక్ స్వీనీ.. ఈ విమాన వివరాలు తెలిపేందుకు ‘ఎలాన్ జెట్’ అనే ట్విట్టర్ ఖాతాను తెరిచాడు. విమానం టెకాప్ అయిన దగ్గర్నుంచి ల్యాండ్ అయ్యేవరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాడు. అయితే ఎలన్ మస్క్ తో పాటు 15 మంది ప్రముఖులకు చెందిన విమానాల ప్రయాణాన్ని ట్రాక్ చేశాడు. కానీ వీరి కంటే ఎలన్ మస్క్ కు చెందిన పేజీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరిగారు. ఎలన్ మస్క్ కు చెందిన ఎలాన్ జెట్ ఫాలోవర్స్ 83 వేలు ఉన్నారు.

ఇదిలా ఉండగా 19 ఏళ్ల కుర్రాడు అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఎలన్ మస్క్ అంగీకరించాడని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే ఆ మొత్తం జాక్ స్వీనీ అందినది లేనిది.. మాత్రం తెలియలేదు. కానీ అతను ఎలన్ మస్క్ కు పెద్ద వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు. విమాన కదలికల్ని ట్రాక్ చేయడం వల్ల తాను ఎంతో లబ్ది పొందానని, ప్రస్తుతం తనకు ఉబర్ జెట్సల్ లో జాబ్ కూడా దొరికిందని పేర్కొన్నాడు.