Begin typing your search above and press return to search.

బాయ్స్ హాస్టల్ లో గర్ల్ ఫ్రెండ్ తో అబ్బాయి.. రోజు ఇలా తీసుకెళ్లాడు

By:  Tupaki Desk   |   4 Feb 2022 10:01 AM GMT
బాయ్స్ హాస్టల్ లో గర్ల్ ఫ్రెండ్ తో అబ్బాయి.. రోజు ఇలా తీసుకెళ్లాడు
X
ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో ఆ యువకుడు చదువుకుంటున్నాడు. బయట ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటే పిల్లాడు చెడిపోతాడని అతడి కుటుంబ సభ్యులు కాలేజ్ బాయ్స్ హాస్టల్లోనే ఉండడానికి ఏర్పాట్లు చేశారు. అయితే కాలేజీ హాస్టల్ లో ఉండే యువకుడి ప్రతిరోజు కాలేజీ్ కు వెళుతూ ఓ పెద్ద ట్రావెల్ బ్యాగ్ తీసుకొని హాస్టల్ నుంచి బయటకు వెళ్లేవాడు. దీంతో హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చి చెక్ చేయగా చివరకు అందులో ఓ అమ్మాయిని ఉంచి తీసుకెళుతున్న వైనం బయటపడింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు.

కాలేజ్ క్యాంపస్ లోని బాయ్స్ హాస్టల్ కు గర్ల్స్ హాస్టల్ నుంచి అమ్మాయిని తీసుకచ్చుకొని ఎంజాయ్ చేశాడో ప్రబుద్ధుడు. గర్ల్ ఫ్రెండ్ ను తప్పించబోయి అడ్డంగా దొరికిపోయి అభాసుపాలయ్యాడు. ఎవరేం చేస్తారులే అనుకున్నాడో, ఎన్ని రోజులు కలిసి ఉన్నాడో తెలియదు పంపించబోయి పట్టుబడ్డాడు. ఇటీవల ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

మణిపాల్ లోని ఒక ప్రముఖ కాలేజ్ లో చదువుకుంటున్న యువకుడిని వారి తల్లిదండ్రులు కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో జాయిన్ చేశారు. యువకుడు రోజూ కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల ఒక రోజు ట్రావెల్ బ్యాగ్ తో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ వదిలి వెళ్తున్నట్టు తమకు సమాచారం లేదని, అతన్ని అడ్డుకున్నారు. సిబ్బంది సీన్లోకి దిగారు. ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నావని అడ్డుకున్నారు. బ్యాగ్ లో ఏముందో చూపించాలని పట్టుబడ్డారు. తాను చూపించనని మొండి కేశాడు. చాలా సేపు వాగ్వివాదం జరిగింది. వారించిన సిబ్బంది బ్యాగ్ ను బలవంతంగా తెరిచారు. దీంతో అసలు కథ బయట పడింది. అందులో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది.

ప్రియురాలితో హాస్టల్ లో ఎంజాయ్ చేసిన యువకుడు గుట్టు చప్పుడు కాకుండా తప్పించేందుకు యత్నించడం అది సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్ గా మరింది. ఎన్ని రోజుల ముందు అమ్మాయి హాస్టల్ కు వచ్చింది. ఏం జరిగిందని తెలియక కాలేజ్ యాజమాన్యం తలపట్టుకుంది. ఈ విషయంపై కాలేజ్ యాజమాన్యం తమకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పడం కొసమెరుపు.