Begin typing your search above and press return to search.

పెళ్లి పీటల నుండి పారిపోయిన వధూవరులు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   19 July 2021 10:30 AM GMT
పెళ్లి పీటల నుండి పారిపోయిన వధూవరులు .. ఎందుకంటే ?
X
పెళ్లి .. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైనది. జీవితంలో ఒకేఒకసారి జరిగే అతి పెద్ద వేడుక. అందుకే ప్రతి ఒక్కరూ కూడా పెళ్లిని తమకి ఉన్నంత లో చాలా ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే , కరోనా మహమ్మారి పెళ్లి వేడుకలపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

కరోనా సమయంలో కొన్ని వేల పెళ్లిళ్లు జరగకుండా ఆగిపోయాయి. ఆ తర్వాత నుండి పెళ్లి సందడి తో కాకుండా కరోనా నియమాలతో , పోలీసుల ఆంక్షలతో జరుగుతున్నారు. కొందరు పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి పెళ్లిళ్లు చేసుకుంటే , సినిమా లో పెళ్లి జరిగేటప్పుడు ఆపండి అనే డైలాగ్ నిజ జీవితంలో కూడా కరోనా కారణంగా జరుగుతున్నాయి. కరోనా నియమాలు పాటించకపోతే పోలీసులు వారి పై కేసులు పెట్టి , జరిమానాలు విధిస్తున్నారు.

ఇదిలా ఉంటే .. తాజాగా పెళ్లి మండపంలోకి పోలీసులు వచ్చేది చూసి, ఆ మండపం నుండి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పారిపోయారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వరుడికి బాలాసోర్ పట్టణానికి చెందిన యువతితో వివాహం చేశారు.

బాలాసోర్ పట్టణంలోని 16వ నంబరు జాతీయ రహదారి పక్కన చహాపులియా చౌక్ వద్ద ఉన్న హోటల్ మంగళ నిలయంలో వీరి వివాహ వేడుక సాగుతోంది. కరోనా వైరస్ నిబంధనలు పాటించకుండా హోటల్ మంగళ నిలయంలోని పెళ్లి మండపంలో పెళ్లి చేస్తున్నారని సోరో పోలీసులకు సమాచారం వచ్చింది.

అంతే, పోలీసులు హుటాహుటిన హోటల్ మంగళ నిలయంలోని పెళ్లి మండపంపై దాడి చేశారు. పోలీసులను చూసిన నూతన వధూవరులిద్దరూ పెళ్లి మండపం నుంచి పారిపోయారు. నూతన వధూవరులు పారిపోవడంతో పెళ్లికి వచ్చిన అతిథులు షాక్‌కు గురయ్యారు.

పెళ్లికి అనుమతి తీసుకున్నా నిబంధనల ప్రకారం 25 మంది మాత్రమే వేడుకలో పాల్గొనాలి. కానీ ఎక్కువ మంది అతిధులను పిలిచి ఆర్భాటంగా పెళ్లి చేస్తుండగా పోలీసులు కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసి హోటల్ యజమానికి రూ.3వేలు, వరుడు తండ్రికి రూ.5వేలు జరిమానా విధించారు.

ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టరు మధుమిత మహంతి తెలియజేశారు. ఈ నెల ప్రారంభంలో కటక్ నగరంలోనూ కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన నిర్వాహకులకు పోలీసులు రూ.50వేల జరిమానా విధించారు.

ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేల నుంచి 5 వేల మార్కుకు చేరింది. ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.