Begin typing your search above and press return to search.
పీటలపై కుప్పకూలిన వధువు ... చెల్లెలి మేడలో తాళి కట్టిన వరుడు !
By: Tupaki Desk | 29 May 2021 7:33 AM GMTపెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన అనుభూతి. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అతి పెద్ద పండుగ. కొందరు రెండు , మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కదా అంటే , అలాంటి ఘటనలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. పెళ్లి కి సిద్దమైన తర్వాత వధువు , వరుడు ఇళ్లల్లో వచ్చే ఆ కళ వేరేగా ఉంటుంది. పెళ్లి పిలుపులు , పెళ్లి పనులు ..ఇలా పెళ్లి తంతు ముగిసేవరకు మొత్తంగా హడావిడి ఎక్కువగా ఉంది. అయితే , తాజాగా ఓ పెళ్లి వేడుక లో విషాదం చోటు చేసుకుంది. అయితే , ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల సమ్మతంతో విషాదం లోను శుభకార్యాన్ని జరిపించారు. పెళ్లి కి మంగళ వాయిద్యాల్ని సిద్ధం చేశారు. చుట్టాలు, అతిథులతో పండగ వాతావరణం నెలకొంది. పెద్దల సమక్షంలో కాబోయే దంపతుల్ని ఆశీర్వదించేందుకు పెళ్లి పెద్దలు సిద్ధమయ్యారు.
కానీ అంతలోనే విషాదం. పెళ్లి పందింట్లో పెళ్లికొడుకు ఒడిలోనే వధువు తనువు చాలించింది. దీంతో పెళ్లి మండపంలో పెళ్లి కుమార్తె మృతదేహాన్ని ఉంచి, వరుడికి బాధితురాలి చెల్లెలితో వివాహం చేశారు. వివరాల్లోకి వెళ్తే .. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలో పెళ్లి కొడుకు మంజేష్ పెళ్లి కుమార్తె సురభి మెడలో తాళికట్టాల్సి ఉంది. అదే సమయంలో వధువు సురభి పెళ్లి పీఠలపై కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే డాక్టర్కు సమాచారం అందించారు. పెళ్లి మండపంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అదే పెళ్లి మండపంలో వరుడికి మృతురాలు చెల్లెలు నిషాతో వివాహం జరిపించారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పెద్ద చెల్లెలు సురభి డెడ్ బాడీని పెళ్లిమండంలో ఉంచాం. ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో నా చిన్న చెల్లెలు నిషాను మంజేష్ కి ఇచ్చి వివాహం జరిపించాం. అనంతరం సురభి అంత్యక్రియలు నిర్వహించాం అని సురభి సోదరుడు మీడియాకి తెలిపాడు.