Begin typing your search above and press return to search.
వారి మాట తీరులో సెక్సీగా ఉంటుందట
By: Tupaki Desk | 7 Feb 2016 10:30 PM GMTఆకర్షించే అందం.. గుబులు రేపే సౌందర్య గురించి విన్నాం కానీ.. పలికే మాట తీరు సెక్సీగా ఉంటుందన్న ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు బ్రిటీషర్లు. తమ మాట తీరుతో ఎంతో సెక్సీగా ఉండటమేకాదు.. ప్రపంచంలో ఇలాంటి గొప్పతనం వారికి మాత్రమే సొంతమని తేలుస్తున్నారు. ప్రపంచంలో సెక్సీగా మాట్లాడేవారి జాబితాను ఒకటి తయారు చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా వారి మాట తీరు సెక్సీగా ఉంటుందని తేల్చారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు చెందిన 11 వేల మంది టైమ్స్ అవుట్ అనే ఒక మ్యాగ్ జైన్ చేసిన తాజా సర్వేలో పాల్గొన్నారు.
ఇంతకీ ఆ సర్వే ఏమిటంటే.. ప్రపంచ భాషల్లో పలికే తీరులో సెక్సీగా హోయలు పోయేది ఎవరన్న అంశంపై అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 11వేల మంది తేల్చిందేమిటంటే.. బ్రిటీషర్ల ఇంగ్లిష్ యాక్సింట్ అదిరిపోతుందని.. సెక్సీగా ఉండటమే కాదు.. వారి ఉచ్ఛారణే మత్తుగా.. గమ్మత్తుగా ఉంటుందని తేల్చేశారు.
తాజా సర్వేలో బ్రిటీష్ యాక్సెంట్ కు 27 మీద ఫిదా అయిపోవటమే కాదు.. బ్రిటీష్ యాక్సెంట్ తర్వాతే ఏ భాష అయినా అని తేల్చేశారు. ఆ తర్వాత స్థానం అమెరికన్ యాక్సెంట్ కు దక్కింది. అయితే.. బ్రిటీషర్లకు.. అమెరికన్లకు మధ్యఅంతరం భారీగా ఉండటం గమనార్హం. బ్రిటీషర్లకు 27 శాతం ఓట్లేసిన వారు.. అమెరికన్ల మాట తీరుకు కేవలం 8.7శాతం మందే ఓటేయటం గమనార్హం. ఏమైనా.. తాజా సర్వే పుణ్యమా అని అత్యంత సెక్సీగా మాట్లాడేవారిగా బ్రిటీషర్లు అవతరించారని చెప్పక తప్పదు సుమా.