Begin typing your search above and press return to search.

ఆసుపత్రిలోనే దుకాణం పెట్టేశారు

By:  Tupaki Desk   |   7 April 2021 9:36 AM GMT
ఆసుపత్రిలోనే దుకాణం పెట్టేశారు
X
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపిన కర్ణాటక మంత్రి రాసలీలల సీడీ కారణంగా మంత్రి పదవిని కోల్పోవటం.. తదితర పరిణామాల గురించి తెలిసిందే. ఇప్పటికి ఆ ఉదంతం ఒక కొలిక్కి రాలేదు. ఉద్యోగం కోసం వచ్చిన యువతిని నమ్మకంగా ట్రాప్ చేసి.. తన లైంగిక అవసరాల్ని తీర్చుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మాజీ మంత్రి వాదన ఒకలా ఉంటే.. యువతి వాదన మరోలా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటకకు చెందిన మరో రాసలీలల సీడీ బయటకు వచ్చి సంచలనాన్ని రేపుతోంది.

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త .. జీపీ సభ్యుడి రాసలీలలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇండి తాలుకాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారు దుకాణం పెట్టేయటం గమనార్హం. తాంబ్రా పంచాయితీ సభ్యుడితో ఆశా కార్యకర్త రాసలీలలు అక్కడి సీసీ కెమేరాలో రికార్డు అయ్యాయి. వారు చేసిన చేష్టలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ పక్క మాజీ మంత్రి రమేశ్ రాసలీలల సీడీ ఎపిసోడ్ ను మరవకముందే.. మరోసారి ఇదే తరహా సీడీ బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది.