Begin typing your search above and press return to search.
తమ్ముళ్ళ త్యాగరాజు కీర్తన ...ఇదేంటి బాబూ...?
By: Tupaki Desk | 22 Oct 2022 12:30 AM GMTపొత్తు అంటే గెలుపు కోసం వ్యూహం కావచ్చు. కానీ స్థానికంగా పనిచేస్తూ తామే ఎమ్మెల్యేలుగా పోటీకి దిగాలని అనుకుంటున్న వారికి ఆశావహులకు అది అతి పెద్ద దెబ్బ. అంటే వారు త్యాగరాజులు అయితే ఏపీలో పార్టీ గెలుస్తుంది. అంటే ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో మూడోవంతో నాలుగో వంతో తమ్ముళ్ళు త్యాగాలుచ్ చేస్తే ఆ పునాదుల మీద అధికార సోపానాలు నిర్మాణం అవుతాయన్న మాట.
అయితే ఎవరో త్యాగాలు చేయాలి తాము అందలాలు అందుకోవాలనే ఎవరైనా కోరుకుంటారు. అది సహజం కూడా. తమ నెత్తి మీదనే పొత్తుల దెబ్బ వచ్చి పడుతుందంటే కలవరపడని నాయకుడు అయితే బహుశా ఎక్కడా ఉండడంటే అతిశయోక్తి కాదు. టీడీపీలో కూడా ఇపుడు అలాంటి అలజడి రేగుతోంది అంటున్నారు.
జనసేనతో పొత్తు ఖాయమని దాదాపుగా తమ్ముళ్లకు అర్ధమైంది. ఇక ఫ్యూచర్ లో చూస్తే అయితే బీజేపీ లేకపోతే వామపక్షాలతో పొత్తులు ఉండడం కూడా కన్ ఫర్మ్ అని తమ్ముళ్ళు లెక్క వేసుకుంటున్నారు. ఈ విధంగా కనీసంగా ఒక నలభై సీట్ల దాకా పొత్తులలో పోతాయన్న సంగతి తమ్ముళ్ళకు అర్ధమైంది. ఇక జనసేన విషయం చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలలో ఆ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది.
అదే విధంగా మిగిలిన జిల్లాలలో కూడా కొన్ని కీలక స్థానాల మీద కన్నేసింది అని అంటున్నారు. దాంతో ఆయా చోట్ల ఇప్పటికే టీడీపీ తరఫున పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తమ్ముళ్లకు ఇపుడు ఇరకాటంగా ఉంది అంటున్నారు. చూస్తే టీడీపీకి కూడా ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉంది.
అక్కడ చాలా కాలంగా పాతుకుపోయిన నేతలు ఉన్నారు. కొత్తగా పార్టీలో దూకుడు చేస్తూ పోటీ చేయాలనుకుంటున్న వారూ ఉన్నారు. ఇపుడు వారి తమ పరిస్థితి ఏంటి అని తెగ పరేషాన్ అవుతున్నారుట. ఇప్పటికే చాలా ముందుకు పోయాం, ఖర్చు పెట్టేశాం, రేపటి రోజున ఈ సీట్లు పొత్తులో భాగంగా పోతే తమ భవిష్యత్తు ఎలా అన్నది వారిని నిద్రపట్టనీయకుండా చేస్తోంది అంటున్నారు. ఇక్కడ మరో విషయం మీద వారు కంగారు పడుతున్నారు అని అంటున్నారు.
అదేంటి అంటే ఒకసారి కనుక ఈ సీట్లను పొత్తులో భాగంగా జనసేన లాంటి బలమైన ప్రాంతీయ పార్టీకి అప్పగిస్తే అక్కడ వారు పాగా వేసి ఫుల్ స్ట్రాంగ్ అవడానికి వీలు ఉంటుంది అని అంటున్నారు. అదే జరిగితే ఇక జీవితంలో తాము మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేసేది ఉండదు, టికెట్లు దక్కేది కూడా ఉండదు అంటున్నారు. అంటే ఈ పొత్తులు తమ రాజకీయ జీవితం మీద శాశ్వతంగా తెర వేసేలా ఉన్నాయనే తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట.
దాంతో పొత్తుల దెబ్బ తమకే అని బావురుమంటున్నారుట. టీడీపీలో చూస్తే బాలయ్యకు,నారా లోకేష్ కు, చంద్రబాబుకు పొత్తుల వల్ల సీట్లు ఎక్కడా పోవు. అలాగే నోరున్న పేరున్న బడా నాయకుల జోలికి అసలే ఎవరూ పోరు. మధ్యలో మాకేంటి నా ఈ నష్టం, కష్టమని వారు వాపోతున్నారుట. దాంతో పొత్తుల విషయంలో టీడీపీలో భిన్నాభిప్రయాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు.
అదే టైం లో తొందరగా పొత్తుల సంగతి ప్రకటిస్తే తమకు ఎలాంటి టెన్షన్ ఉండదని, ఇపుడు తాము డబ్బు తీసి ఖర్చు పెట్టి ఆనక టికెట్ దక్కక పొత్తుల పేరిట సీటు గల్లంతు అయినా జనాల్లో నవ్వుల పాలు కాకుండా ఉంటామని తమ్ముళ్ళు అంటున్నారుట. ఏది ఏమైనా ఈ పొత్తుల వ్యవహారం మాత్రం టీడీపీలో కొంత సమస్యగానే ఈసారి ఉంటుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.